మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్‌), వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టులు: 500

వివరాలు:

1. అసిస్టెంట్ ఫోర్ మెన్‌(ఎలక్ట్రికల్‌, ట్రెయినీ): 150

2. టెక్నీషియన్‌ (ఎలక్ట్రీషియన్‌, ట్రెయినీ): 350

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, టెన్త్‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2026 మే 28వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ పోస్టుకు నెలకు రూ.47,330, టెక్నీషియన్‌కు పోస్టుకు రోజుకు రూ.1,583.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1,180 (GSTతో కలిపి). ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు & ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: ఎంపిక కేవలం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారానే జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది (సెక్షన్-A: జనరల్ అవేర్‌నెస్/ఆప్టిట్యూడ్ - 20 మార్కులు, సెక్షన్-B: టెక్నికల్ - 80 మార్కులు). తప్పుడు సమాధానాలకు నెగటివ్ మార్కులు లేవు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 మే 7.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మే 28.

Website:https://www.mahanadicoal.in/Welcome.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram