ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

హర్‌ గోబింద్‌ ఖొరానా 

ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు.


ఈయన భారత సంతతికి చెందిన అమెరికా కణజీవ శాస్త్రవేత్త (Molecular biologist). జన్యు పదార్థాల రసాయన సంశ్లేషణపై అనేక ప్రయోగాలు చేశారు. ప్రోటీన్‌ సంశ్లేషణలో జన్యుకోడ్‌ పాత్రను కూడా వివరించారు. మానవ కణాల్లో డీఎన్‌ఏ విశిష్టతను తన ప్రయోగాల ద్వారా వెల్లడించారు. జన్యువుల్లోని కోడ్‌లను సమగ్రంగా వివరించినందుకు ఈయనకు వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన తెలిపిన జన్యు కోడ్‌ల ఆధారంగా జన్యువుల్లో మార్పులు చేయడం, జీవరాశుల్లో జన్యుమార్పిడి విధానాల ద్వారా అవాంఛిత లక్షణాలను తొలగించడం లాంటి ఎన్నో విధానాలు అమల్లోకి వచ్చాయి. పారిశ్రామికంగా జన్యువులను ఉత్పత్తి చేయడానికి ఈయన పరిశోధనలు వీలు కల్పించాయి. 

బాల్యం - వృత్తి జీవితం

  • హర్‌ గోబింద్‌ ఖొరానా 1922, జనవరి 9న పంజాబ్‌లోని రాయ్‌పుర్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించారు. ముల్తాన్‌లోని దయానంద్‌ ఆంగ్లో వేద ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. అందులో ఉపాధ్యాయుడిగా ఉన్న రతన్‌ లాల్‌ సైన్స్‌పై ఆసక్తి పెంచుకునేలా ఖొరానాను ఎంతో ప్రభావితం చేశారు. లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. 
  • స్కాలర్‌షిప్‌ సాయంతో లాహోర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో చేరి 1943లో కెమిస్ట్రీలో బ్యాచిలర్‌ డిగ్రీని, 1945లో ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీని పొందారు. అనంతరం ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో లివర్‌పూల్‌ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ ప్రొఫెసర్‌ రోజర్‌ జేఎస్‌ బీర్‌ పర్యవేక్షణలో అనేక విషయాలు తెలుసుకున్నారు. 1948లో పీహెచ్‌డీ పట్టా పొందారు. 
  • దేశ విభజన తర్వాత ఖొరానా కుటుంబం దిల్లీ వచ్చి స్థిరపడింది. పీహెచ్‌డీ చేశాక ఆయన భారత్‌కు తిరిగి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. 
  • కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధనలు చేసేందుకు ఫెలోషిప్‌ పొంది 1950లో తిరిగి ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ రసాయన శాస్త్రవేత్తలైన అలెగ్జాండర్‌ ఆర్‌ టోడ్‌ (1957లో రసాయనశాస్త్రంలో నోబెల్‌ వచ్చింది), జార్జ్‌ వాలెస్‌ కన్నర్‌తో కలిసి పనిచేశారు. పెప్టైడ్‌లు, న్యూక్లియోటైడ్‌లపై పరిశోధనలు చేశారు. 1952 వరకు అక్కడే ఉన్నారు. ప్రాథమిక జీవ సమస్యలకు సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీని వర్తింపజేయాలనే ఆలోచన ఆయనకు అప్పుడే కలిగింది.
  • 1952లో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ న్యూక్లియర్‌ ఆమ్లాల ఫాస్ఫేట్‌ ఎస్టర్లపై పరిశోధనలు చేశారు. 1959 వరకు అక్కడే పనిచేశారు.
  • 1960-70 వరకు అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో పనిచేశారు. 
  • 1966లో అమెరికా పౌరసత్వం తీసుకున్నారు.
  • 1971లో మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో ప్రొఫెసర్‌గా చేరారు. 2007 వరకు అక్కడే పనిచేశారు.

పరిశోధనలు

  • 1960 దశకంలో ఖొరానా చేసిన పరిశోధనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పరిశీలిస్తే..
  • అమెరికన్‌ బయో కెమిస్ట్‌ మార్షల్‌ వారెన్‌ నైరెన్‌బర్గ్‌ ప్రతిపాదించిన జన్యుకోడ్‌ నమూనాను ఖొరానా ధ్రువీకరించారు.
  • న్యూక్లియోటైడ్‌ కోడ్‌ ఎప్పుడూ కోడాన్‌లు అని పిలిచే మూడు సమూహాల్లో కణానికి ప్రసారం అవుతుందని ఖొరానా నిరూపించారు. కొన్ని కోడాన్‌లు కణాన్ని ప్రోటీన్ల తయారీని ప్రారంభించడానికి లేదా ఆపడానికి ప్రేరేపిస్తాయని నిర్ధారించారు.
  • జీవ కణాల్లో ప్రోటీన్లు నిర్వహించే విధులను నిర్ణయించే జన్యువుల కోడ్‌ను, సంకేతాలను ఖొరానా మొదటిసారిగా కనుక్కున్నారు.
  • ఎంజైమ్‌లపై అనేక పరిశోధనలు చేశారు. డీఎన్‌ఏ ప్రతిరూపణ సంక్లిష్ట ప్రక్రియలో వాటి పాత్ర, ప్రాముఖ్యత గురించి వివరించారు. 
  • 1970లో ఈస్ట్‌ జన్యువు మొదటి కృత్రిమ కాపీని సంశ్లేషించారు. 
  • 1972లో రాబర్ట్‌ - డబ్ల్యూ - హార్లీ, మార్షన్‌ - నైరెన్‌బర్గ్‌లతో కలిసి ని‘్నఃi లో కృత్రిమ జన్యువును రూపొందించారు.

అవార్డులు - గౌరవాలు

  • 1966లో యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌; 1967లో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌; 1973లో అమెరికన్‌ ఫిలసాఫికల్‌ సొసైటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  • 1968లో లెస్టర్‌ పురస్కారం దక్కింది.
  • 1969లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.
  • 1971లో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ అచీవ్‌మెంట్‌ గోల్డెన్‌ ప్లేట్‌ అవార్డు పొందారు.
  • 1968లో నోబెల్‌ బహుమతి లభించింది. అదే ఏడాది అమెరికా నోబెల్‌గా పేర్కొనే ‘ఆల్బర్ట్‌ లాస్కర్‌ - బేసిక్‌ మెడికల్‌ రిసెర్చ్‌ అవార్డు’ అందుకున్నారు.
  • 1978లో రాయల్‌ సొసైటీ విదేశీ సభ్యుడిగా నియమితులయ్యారు.
  • 1987లో అమెరికా సైన్స్‌ మెడల్‌ పొందారు.

చివరగా

  • ప్రయోగశాలలో డీఎన్‌ఏను సంశ్లేషణ చేసిన మొదటి వ్యక్తిగా ఖొరానా పేరొందారు. ఆయన పరిశోధనలు బయోటెక్నాలజీ రంగంలో నూతన ఒరవడికి కారణమయ్యాయి. జన్యుపరమైన వ్యాధుల నివారణ, కొత్త వంగడాల సృష్టి మొదలైనవాటికి ఖొరానా ప్రయోగాలు కీలకంగా నిలిచాయి. ఈయన 2011, నవంబరు 9న అమెరికాలోని కాన్కార్ట్‌లో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ 2019)

Q: హర్‌ గోబింద్‌ ఖొరానా కింది ఏ సంవత్సరంలో వైద్యరంగంలో నోబెల్‌ బహుమతి పొందారు?

1) 1962  

2) 1964

3) 1966  

4) 1968

సమాధానం: 4

(MP Police Constable 2023)
Q:
Which of the following scientist received the National Medal of Science in 1987 for serving three Universities in North America?
1) Satyendra Nath Bose
2) Dr APJ Abdul Kalam
3) Har Gobind Khorana
4) Birbal Sahni
Answer: 3

(GSET Official Paper 4: Held in September 2016)
Q:
The work of Hargobind Khorana in which he got Nobel Prize was:
1) Penicillin
2) Sulpha drug
3) Cracking of genetic code
4) Pairing of nucleotide base
Answer: 3


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram