ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

థామస్‌ ఆల్వా ఎడిసన్‌

ఈయన అమెరికా శాస్త్రవేత్త. ఎలక్ట్రిక్‌ బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్‌ పిక్చర్‌ కెమెరా, టెలిఫోన్‌ - టెలిగ్రాఫ్‌ పనితీరును మెరుగుపరచడం లాంటివన్నీ ఆయన అద్భుత సృష్టికి నిదర్శనాలే. ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న అనేక వస్తువులకు ఎడిసన్‌ పరిశోధనలే మూలం.


తన ఆవిష్కరణల ద్వారా మానవ జాతిని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తుల్లో థామస్‌ ఆల్వా ఎడిసన్‌ ఒకరు. ఈయన అమెరికా శాస్త్రవేత్త. ఎలక్ట్రిక్‌ బల్బు, ఫోనోగ్రాఫ్, మోషన్‌ పిక్చర్‌ కెమెరా, టెలిఫోన్‌ - టెలిగ్రాఫ్‌ పనితీరును మెరుగుపరచడం లాంటివన్నీ ఆయన అద్భుత సృష్టికి నిదర్శనాలే.  ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న అనేక వస్తువులకు ఎడిసన్‌ పరిశోధనలే మూలం. విస్తృతమైన శ్రేణి రంగాల్లో తన ముఖ్యమైన ఆవిష్కరణల ద్వారా ప్రజల జీవన శైలిని మార్చగలిగారు. ఈయన అక్టోబరు 18న మరణించారు. ఈ సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో ఎడిసన్‌ జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..

బాల్యం - కెరీర్‌

  • ఎడిసన్‌ 1847, ఫిబ్రవరి 11న అమెరికాలోని మిలన్‌లో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో ఎడిసన్‌కు చదువు సరిగ్గా రావడంలేదని పాఠశాల నుంచి పంపేశారు. అప్పటి నుంచి తల్లి నాన్సీ మాథ్యూస్‌ ఆయనకు గురువుగా మారి అనేక విషయాలు నేర్పించారు. సాహిత్యం, సైన్స్, చరిత్ర పట్ల ఆయనకు ఆసక్తి కలిగించారు. 
  • 1861లో అమెరికాలో సివిల్‌ వార్‌ జరుగుతున్న సమయంలో ‘గ్రాండ్‌ ట్రంక్‌ హెరాల్డ్‌’ అనే వార్తాపత్రికను నడిపారు. 1862లో ఆయన టెలీగ్రఫీని నేర్చుకుని, వివిధ కంపెనీల్లో టెలిగ్రఫీ ఆపరేటర్‌గా పనిచేశారు.
  • 1869లో ఆయన మొదట ఎలక్ట్రిక్‌ ఓట్‌ రికార్డర్‌ను కనిపెట్టి, దానికి పేటెంట్‌ తీసుకున్నారు. అది వాణిజ్యపరంగా అంతగా లాభించలేదు. 1871లో ఆయన రూపొందించిన ‘యూనివర్సల్‌ స్టాక్‌ ప్రింటర్‌’ ఆర్థికంగా ఆయనకు అతిపెద్ద విజయాన్ని,  కీర్తిని సంపాదించిపెట్టింది. అప్పటినుంచి ఆయన అనేక రకాల ఆవిష్కరణలు చేశారు.

ముఖ్యమైన ఆవిష్కరణలు - నెలకొల్పిన సంస్థలు

  • 1877లో ఫోనోగ్రాఫ్‌ (గ్రామ్‌ఫోన్‌) కనిపెట్టారు. దీంతో ధ్వనిని రికార్డ్, పునరుత్పత్తి చేయొచ్చు. ఆధునిక సంగీత, రికార్డింగ్‌ పరిశ్రమలకు ఇదే పునాది.
  • 1878లో విద్యుత్‌ బల్బ్‌ రూపొందించారు. ఇది ఆయన్ను ఆర్థికంగా మరింత ఎదిగేలా చేసింది. అప్పుడే ఆయన ఎడిసన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీని స్థాపించి, దాని ద్వారా బల్బుల ఉత్పత్తి, మార్కెటింగ్‌ చేశారు.
  • 1877-78లో ధ్వని నాణ్యతను మెరుగుపరిచే కార్బన్‌ ట్రాన్స్‌మిటర్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా టెలీఫోన్‌ పరిశ్రమ మెరుగుపడింది.
  • 1887-89 మధ్య కాలంలో టైప్‌ రైటర్, ఎలక్ట్రిక్‌ పెన్‌ ఆవిష్కరణ; తక్కువ గ్రేడ్‌ - ఉపయోగించడానికి వీలులేని ఖనిజాల నుంచి ఇనుప ధాతువును వేరు చేయడానికి అయస్కాంతీకరణ ప్రయోగాలు నిర్వహించడం లాంటివి చేశారు.
  • 1908లో మోషన్‌ పిక్చర్స్‌ పేమెంట్‌ కంపెనీని స్థాపించారు.
  • 1909లో నికెల్‌-ఇనుము ఆల్కలీన్‌ బ్యాటరీని కనిపెట్టారు. ఆ సమయంలో ఉన్న యాసిడ్‌ బ్యాటరీల కంటే ఇది ఎక్కువ కాలం పనిచేసింది. ప్రస్తుతం మన ఫోన్లలో వాడే లిథియం అయాన్‌ బ్యాటరీ కంటే ముందు ఆల్కలీన్‌ బ్యాటరీనే ఉపయోగించారు.

ముఖ్యమైన పురస్కారాలు - గౌరవాలు

  • 1881లో అత్యున్నత ఫ్రెంచ్‌ అవార్డ్‌ అయిన ‘ఆఫీసర్‌ ఆఫ్‌ లెజియన్‌ ఆఫ్‌ ఆనర్‌’ పొందారు.
  • 1887లో ఇటాలియన్‌ అవార్డ్‌ అయిన మాట్టేయుచి మెడల్‌ అందుకున్నారు.
  • 1890లో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో సభ్యుడయ్యారు.
  • 1889లో జాన్‌ స్కాట్‌ మెడల్‌ పొందారు.
  • 1899లో ఎడ్వర్డ్‌ లాంగ్‌ స్ట్రెత్‌ మెడల్‌ సాధించారు.
  • 1908లో జాన్‌ ఫ్రిడ్జ్‌ మెడల్‌ అందుకున్నారు.
  • 1915లో ఫ్రాంక్లిన్‌ మెడల్‌ పొందారు.
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈఈఈ) సంస్థ సైన్స్, సాంకేతిక రంగంలో ప్రతిభ చూపినవారికి ‘ఎడిసన్‌ మెడల్‌’ పేరుతో పురస్కారాన్ని అందిస్తుంది. ఇంజినీరింగ్‌లో దీన్ని అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.
  • ఎడిసన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని అమెరికాలో ఏటా ఫిబ్రవరి 11న ‘నేషనల్‌ ఇన్వెస్టర్స్‌ డే’గా నిర్వహిస్తారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q: థామస్‌ ఆల్వా ఎడిసన్‌ కింది దేన్ని కనిపెట్టారు?  (ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

1) విద్యుదయస్కాంతం

2) విద్యుత్‌ బల్బు

3) సర్క్యూట్‌

4) థర్మామీటర్‌

సమాధానం: 2

Q: Thomas Alva Edison, who invented electric light bulb, belonged to ______.
This question was previously asked in
DSSSB TGT Natural Science Male General Section - 29 Sept 2018 Shift 1
1) Italy
2) USA
3) Germany
4) France
Ans: 2 


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram