ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 

20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్‌ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు.


20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్‌ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు. భౌతికశాస్త్రంలో ‘కృష్ణ బిలాల గణిత సిద్ధాంతాన్ని’ (Mathematical Theory of black holes) కనుక్కున్నారు. అందుకు 1983లో నోబెల్‌ బహుమతి పొందారు. ఈయన నక్షత్రాల నుంచి వెలువడే రేడియేషన్‌ శక్తి, నక్షత్ర శకలాలు, తెల్లని పొట్టి నక్షత్రాలు మొదలైన వాటిపై పరిశోధనలు చేశారు. ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఖగోళ వస్తువుల మధ్య అత్యధిక దూరాలు కొలిచేందుకు కొన్ని ప్రత్యేక ప్రమాణాలను రూపొందించారు. ఇవన్నీ అంతరిక్షశాస్త్ర పరిశోధనలకు ఎంతగానో తోడ్పడ్డాయి. అక్టోబరు 19న చంద్రశేఖర్‌ జన్మదినం సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • చంద్రశేఖర్‌ 1910, అక్టోబరు 19న లాహోర్‌ (ప్రస్తుత పాకిస్థాన్‌)లో జన్మించారు. 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన సీవీ రామన్‌ ఈయనకి బాబాయ్‌ అవుతారు. 1918లో వీరి కుటుంబం మద్రాస్‌లో స్థిరపడింది. 
  • తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో చంద్రశేఖర్‌కు 12 ఏళ్లు వచ్చే వరకు ఇంట్లోనే చదువుకున్నారు. తర్వాత మద్రాస్‌లోని ఉన్నత పాఠశాలలో చేరారు. 1925-30 వరకు మద్రాస్‌ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే ప్రెసిడెన్సీ కాలేజ్‌లో చదివారు. ఆ సమయంలోనే ఆయనకు అంతరిక్ష భౌతిక విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి కలిగింది. 
  • 1930లో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పొందారు. అక్కడి ట్రినిటీ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌లో చేరారు. చివరి సంవత్సరంలో పరిశోధనల నిమిత్తం కోపెన్‌హగన్‌లోని (డెన్మార్క్‌) ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌కి వెళ్లారు. అక్కడే ఆయన నీల్స్‌ బోర్‌ను కలిశారు. నక్షత్రాల జననం, మరణాలపై అధ్యయనం చేశారు. ప్రముఖ బ్రిటిష్‌ ఫిజిసిస్ట్‌ ప్రొఫెసర్‌ రాల్ఫ్‌ ఫౌలర్‌ మెంటార్‌షిప్‌తో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 
  • 1935లో అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో విజిటింగ్‌ లెక్చరర్‌గా చేరారు. 1937లో విస్కాన్సిన్‌లోని (అమెరికా) యెర్కిస్‌ అబ్జర్వేటరీలో సైద్ధాంతిక ఖగోళ భౌతికశాస్త్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఇది చికాగో విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. 
  • 1952-71 వరకు ‘ది ఆస్ట్రోఫిజికల్‌ జర్నల్‌’ సంపాదకుడిగా పనిచేశారు.
  • 1953లో అమెరికా పౌరసత్వం తీసకున్నారు.

ముఖ్యమైన అవిష్కరణలు - పరిశోధనలు

  • 1940లో ‘చంద్రశేఖర్‌ ద్రవ్యరాశి’ని వివరించారు. నక్షత్రం భరించే భారస్థితిని దీంతో నిర్వచిస్తారు.
  • 1950లో నక్షత్రాలు, అక్కడి వాతావరణం నుంచి కాంతి ఎలా ప్రయాణిస్తుందనే దానిపై వివిధ సిద్ధాంతాలు అభివృద్ధి చేశారు. 
  • 1951-53లో చంద్రశేఖర్‌ - ఫెర్మి మెథడ్‌ రూపొందింది.
  • 1986లో చంద్రశేఖర్‌ వేవ్స్‌ను కనిపెట్టారు.

అవార్డులు - గౌరవాలు

  • 1944లో రాయల్‌ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు.
  • 1953లో రాయల్‌ ఆస్ట్రో సొసైటీ నుంచి బంగారు పతకం పొందారు.
  • 1966లో, అమెరికా ప్రభుత్వం నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ అవార్డును ప్రదానం చేసింది.
  • 1968లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్‌ అందుకున్నారు.
  • 1984లో రాయల్‌ సొసైటీ కోప్లీ పతకాన్ని పొందారు. ఆయన బ్రూస్‌ మెడల్, హెన్రీ డ్రేపర్‌ పతకం, హంబోల్ట్‌ బహుమతి మొదలైనవి అందుకున్నారు.

చివరగా

  • నక్షత్రాలు, వాటి నిర్మాణంపై చంద్రశేఖర్‌ పరిశోధనలు, ఆవిష్కరణలు ఖగోళ ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నాసా నెలకొల్పిన ‘ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ’లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయనకు దక్కాల్సి గౌరవం మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. 1930 దశకంలో ఆయన చేసిన పరిశోధనలకు 1989లో నోబెల్‌ బహుమతి రావడమే ఇందుకు నిదర్శనం.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

Q. Which Indian astrophysicist and Nobel laureate predicted rapidly rotating stars emitting polarised light?
This question was previously asked in GSET Official Paper 2: 
Held on September 2018
1) S. Chandrasekhar
2) C. V. Raman
3) S. Ramanujam
4) Venkat Raman Ramakrishnan
Ans: 1

ప్ర: సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌కు కింది ఏ రంగంలో నోబెల్‌ బహుమతి లభించింది?  (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ 2021)

1) రసాయనశాస్త్రం

2) భౌతికశాస్త్రం

3) గణితం

4) ఆర్థికశాస్త్రం

సమాధానం: 2


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram