ఆసియాన్‌-ఇండియా శిఖరాగ్ర సదస్సు

ఆసియాన్‌-ఇండియా శిఖరాగ్ర సదస్సు

ప్రధాని నరేంద్ర మోదీ 2026, నవంబరు 17న ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 23వ ఆసియాన్‌-ఇండియా శిఖరాగ్ర సదస్సులో, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్నారు. ఆసియాన్‌ సదస్సు సందర్భంగా క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ (క్వాడ్‌) కూటమి దేశాల అధినేతలు విడిగా సమావేశం అయ్యారు. క్వాడ్‌ కూటమిలో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, జపాన్‌ ప్రధాని సనాయే తకాయిచిలతో సమావేశమయ్యారు. రెండేళ్ల తర్వాత ఈ సదస్సు జరిగింది. 2025లో భారత్‌లో జరగాల్సి ఉన్నా.. ట్రంప్‌ రాకపై సందిగ్ధం నెలకొనడంతో జరగలేదు. ఇండో-పసిఫిక్‌లో శాంతి, భద్రత, సుస్థిరతపై క్వాడ్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram