దట్టమైన వృక్షాలు, పొదలతో కూడిన విశాల భూభాగాలను అడవులు అంటారు. ఇవి సహజ వనరులు. మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతిలో వాటంతట అవే పుట్టి, పెరుగుతాయి. జీవావరణ వ్యవస్థలో, ప్రకృతి సమతౌల్యతలో కీలకమైనవిగా, అత్యంత విలువైనవిగా అడవులను పేర్కొంటారు. ఇవి అనేక వృక్షాలు, జంతు జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. జనాభా పెరుగుదల, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి లాంటి కార్యకలాపాల వల్ల వీటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో వన్యప్రాణులతోపాటు సమస్త భూమండలానికి ముప్పు వాటిల్లుతోంది. వీటిని అధిగమించి అడవుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం (World Forestry Day/ International Day of Forests)గా నిర్వహిస్తారు. అడవుల నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ప్రపంచవ్యాప్తంగా అడవులు..
భారతదేశంలో అడవులు..
ఐఎస్‌ఎఫ్‌ఆర్ నివేదిక
చారిత్రక నేపథ్యం
భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) మార్చి 21న ‘వరల్డ్ ఫారెస్ట్ డే’గా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన ఎఫ్‌ఏఓ 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలూ దీన్ని ఆమోదించాయి. తర్వాత 2012, నవంబరు 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది.
2026 నినాదం: "Forests and Economies".
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023),(ఎంపీ ఎక్సైజ్ కానిస్టేబుల్, 2023),
1) జూన్ 21 2) మార్చి 21
3) ఏప్రిల్ 21 4) ఆగస్టు 21
సమాధానం: 2
2. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(ఎస్‌ఎస్‌సీ సీపీఓ టైర్-1, 2022), (యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021),
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2022)(కరళ పీఎస్సీ - గ్రాడ్యుయేట్ లెవల్, 2022),
(టీఎన్‌పీఎస్సీ గ్రూప్ 1, 2011)
1) హైదరాబాద్ 2) కోల్‌కతా
3) బెంగళూరు 4) ముంబయి
సమాధానం: 1
3. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్‌ఎఫ్‌ఆర్) - 2023 ప్రకారం, అటవీ విస్తీర్ణంలో (వృక్ష విస్తీర్ణాన్ని మినహాయించి) అత్యధిక పెరుగుదలను కింది ఏ రాష్ట్రం నమోదు చేసింది?
(ఐబీ ఏసీఐఓ గ్రేడ్ 2 (ఎగ్జిక్యూటివ్), 2025)
1) ఒడిశా 2) నాగాలాండ్
3) మిజోరం 4) మధ్యప్రదేశ్
సమాధానం: 3
4. The Forest Survey of India under the ministry of Environment of India is located in which city?
(RRB NTPC CBT-I, 2021)
1) Guwahati 2) Bhopal
3) Dehradun 4) New Delhi
Ans: 3
5. Which of the following statement(s) is/are correct about 'India State of the Forest Report' (ISFR)?
A) The first State of the Forest Report was published in 1947.
B) The report is based on the biennial assessment of India's forests carried out by Forest Survey of India (FSI).
C) Based on the ISFR 2021 report the total forest cover of the country is 21.71% of the total geographical area of the country.
D) The ISFR 2021 report shows a decrease of forest cover as compared to the previous assessment.
(EMRS PGT (History), 2023)
1) Only (B), (C) and (D) are correct
2) Only (C) and (D) are correct
3) Only (B) and (C) are correct
4) Only (A), (B) and (C) are correct
Ans: 3