నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) అనేది పౌర రక్షణ సేవాదళం. యువతలో పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో సైనిక దళాలతో సమానంగా పనిచేసేలా ఎన్సీసీ వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం యువజన దళంగా ఎన్సీసీ ప్రసిద్ధి చెందింది. ఎన్సీసీ ఏర్పాటుకు గుర్తుగా మన దేశంలో ఏటా నవంబరు నాలుగో ఆదివారం రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది (2026) అది నవంబరు 22న వచ్చింది. యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా, నాయకులుగా తీర్చిదిద్దడంలో ఎన్సీసీ పాత్రను గుర్తు చేసుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ఎన్సీసీ
చారిత్రక నేపథ్యం
భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1948, నవంబరు చివరి ఆదివారం నాడు దిల్లీలో మొదటి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) యూనిట్ ఏర్పాటు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దీనికి గుర్తుగా నవంబరు చివరి ఆదివారం రోజున ‘నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.
ఎన్సీసీ నినాదం: ఐక్యతా, క్రమశిక్షణ (Unity and Discipline).
|
ఇప్పటివరకు ఎన్సీసీ చేపట్టిన ముఖ్య కార్యక్రమాలు, ఎన్సీసీ సర్టిఫికెట్స్, వాటి ఉపయోగాలతోపాటు గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ టాపిక్ పై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. పాఠశాలల్లో ఎన్సీసీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
(రాజస్థాన్ ప్రీ డి.ఈఐ.ఈడీ (బీఎస్టీసీ), 2021)
1) వినోదం 2) నాయకత్వ శిక్షణ
3) సామాజిక సంక్షేమం 4) శారీరక వికాసం
సమాధానం: 2
2. కిందివాటిలో ఎన్సీసీ నినాదం ఏమిటి?
(బిహార్ విధాన పరిషత్ (డీఈఓ), 2023)
1) ఐక్యత, క్రమశిక్షణ 2) ఐక్యత, సమగ్రత
3) ఐక్యత, కమాండ్ 4) ఐక్యత, సేవ
సమాధానం: 1
3. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) దేనిలో భాగం?
(ఏఓసీ మెటీరియల్ అసిస్టెంట్, 2022)
1) త్రివిధ దళాల కమాండ్ 2) యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) హోం మంత్రిత్వ శాఖ 4) రక్షణ మంత్రిత్వ శాఖ
సమాధానం: 4
4. భారత సాయుధ దళాల యువజన విభాగమైన ఎన్సీసీ పూర్తి రూపం ఏమిటి?
(యూపీ పోలీస్ ఏఎస్ఐ, 2021)
1) నేషనల్ కమిటీ ఆఫ్ క్యాడెట్స్ 2) నేషనల్ క్యాడెట్స్ కాలేజ్
3) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ 4) నేషనల్ క్యాడెట్స్ కమిషన్
సమాధానం: 3
5. Who has launched the Directorate General National Cadet Corps (DGNCC) mobile training app?
(SSC MTS, 2021)
1) Narendra Modi 2) Piyush Goyal 3) Nitin Gadkari
4) Rajnath Singh 5) Hardeep Singh Puri
Ans: 4
6. Who is the current Directorate General of National Cadet Corps of India as of October 2024?
(RRB Technician Grade III, 2024)
1) Gurbirpal Singh 2) Manoj Pande
3) Dalbir Singh Suhag 4) Bikram Singh
Ans: 1
7. With which organization has the National Cadet Corps (NCC) partnered to launch a nationwide Cyber Security Capacity Building Programme for its cadets?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) National Informatics Centre (NIC)
2) National Institute of Electronics and Information Technology (NIELIT)
3) Indian Computer Emergency Response Team (CERT-In)
4) Centre for Development of Advanced Computing (C-DAC)
5) NASSCOM
Ans: 2
8. Anil swarup committee is appointed for recommandation to strengthen the following
i) Scouts
ii) NSS
iii) NCC
(AP Police Constable Prelims, 2019)
1) i and ii 2) i and iii 3) ii and iii 4) i, ii and iii
Ans: 3