అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం

చిన్నారులు సమాజానికి, దేశానికి విలువైన సంపద. భావి పౌరులైన వీరి భద్రత, సంరక్షణ, అభివృద్ధికి అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇవ్వాలి. బాల్యం ఆనందంగా సాగేలా చర్యలు తీసుకోవడంతోపాటు నేర్చుకోవాలి, ఎదగాలనే తపన వారిలో కలిగించే వాతావరణాన్ని కల్పించాలి. వారి హక్కులకు రక్షణ అందించాలి. ప్రభుత్వాలతో సహా ప్రతి ఒక్కరూ బాలల సంక్షేమానికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏటా నవంబరు 20న ‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’గా (International Day Of Child Rights) నిర్వహిస్తారు. దీన్నే ప్రపంచ బాలల దినోత్సవం (Universal Children's Day) అనే పేరుతోనూ పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, వారికి ఉన్న హక్కుల గురించి సమాజానికి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

ప్రపంచంలో బాలల స్థితిగతులు-2025 (The State of the World's Children 2025)

  • ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో ఉన్న బాలల పరిస్థితిని అధ్యయనం చేసి యునిసెఫ్‌ ప్రపంచంలో బాలల స్థితిగతులు-2025 నివేదికను విడుదల చేసింది. 130 అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో విద్య, ఆరోగ్యం, గృహవసతి, పోషణ, పారిశుద్ధ్యం, మంచి నీటి లభ్యత అనే ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. బహుముఖ పేదరికం అనుభవిస్తోన్న పిల్లల్లో అత్యధిక శాతం సబ్‌-సహారా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో నివసిస్తున్నారు.
  • భారత్‌లో ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది (20.6 కోట్లు) విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం లాంటి ఆరు తప్పనిసరి సేవల్లో కనీసం ఒక దాన్ని పొందలేకపోతున్నారని యునిసెఫ్‌ నివేదిక పేర్కొంది. ఇందులో మూడోవంతు (6.2 కోట్లు) కంటే తక్కువ మంది పిల్లలు రెండు లేదా అంత కంటే ఎక్కువ కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారని వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో 23 కోట్ల మందికి పైగా చిన్నారులకు కనీస సేవలు అందుతున్నా, పురోగతిలో అసమానత్వం ఉంది. 

చిల్డ్రన్‌ క్లైమేట్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2026

  • దీన్ని యునిసెఫ్‌ 2026, జూన్‌ 16న విడుదల చేసింది. పిల్లలు ఎదుర్కొంటోన్న వాతావరణ ప్రమాదాలు, వారిలో అంతర్లీనంగా ఉన్న శారీరక బలహీనతలు, వారికి లభించే సేవల్లోని లోపాల కారణంగా హక్కులను పొందలేకపోవడం లాంటి విషయాలను ఇది వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ల మంది పిల్లలు కనీసం మూడు పరస్పర సంబంధ వాతావరణ ప్రమాదాలకు గురవుతున్నారు.
  • భారత్‌లో కనీసం 411.62 మిలియన్ల మంది పిల్లలు (97%) కనీసం రెండు రకాల వాతావరణ లేదా విపత్తు సంబంధిత ప్రమాదాల బారినపడుతున్నారని నివేదిక వెల్లడించింది. దేశంలో దాదాపు 42.1 కోట్ల మంది పిల్లలు అనారోగ్యకరమైన వాయు కాలుష్య స్థాయులకు గురవుతున్నారు. దాదాపు 29.4 కోట్ల మంది బాలలు మలేరియా ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2024లో భారత్‌లో 54.78 మిలియన్ల మంది విద్యార్థులు వాతావరణ సంబంధ అంతరాయాల వల్ల స్కూళ్లకు దూరమయ్యారు. 

ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు (United Nations Convention on the Rights of the Child - UNCRC)

ఇది బాల్యానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. 18 ఏళ్లలోపు పిల్లలందరికీ మెరుగైన ప్రపంచాన్ని అందించేందుకు వివిధ మార్గదర్శకాలను ఈ కన్వెన్షన్‌ నిర్దేశిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ఈ కన్వెన్షన్‌ 1990, సెప్టెంబరు 2న అమల్లోకి వచ్చింది. 196 దేశాలు దీన్ని ఆమోదించాయి. ఈ కన్వెన్షన్‌పై సంతకం చేసినా, దీన్ని ఆమోదించని ఏకైక ఐరాస సభ్యదేశం అమెరికా. భారత్‌ 1992, డిసెంబరు 11న ఈ కన్వెన్షన్‌ను ఆమోదించింది.

యూఎన్‌సీఆర్‌సీ కన్వెన్షన్‌ ముఖ్య లక్షణాలు - లక్ష్యాలు, ప్రధాన ఆర్టికల్స్, భారతదేశంలో చిన్నారుల హక్కులు - రక్షణ కోసం అమలవుతున్న చట్టాలు, పని చేస్తున్న సంస్థలు, చారిత్రక నేపథ్యంతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 120కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2025),

(యూపీ పోలీస్‌ అసిస్టెంట్‌ ఆపరేటర్, 2024),

(రాజస్థాన్‌ థర్డ్‌ గ్రేడ్, 2012) 

1) నవంబరు 20               2) అక్టోబరు 10

3) జనవరి 1                  4) డిసెంబరు 25

సమాధానం: 1

2. ఐక్యరాజ్యసమితి ‘పిల్లల హక్కుల ప్రకటనను’ ఏ సంవత్సరంలో ఆమోదించింది?

(ఓపీఎస్సీ ఓఏఎస్‌ ప్రిలిమ్స్, 2024)

1) 1949       2) 1951       3) 1956       4) 1959

సమాధానం: 3

3. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్, 2024), (ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్, 2021),

(బిహార్‌ సీనియర్‌ సెకండరీ టీచర్‌ (సోషియాలజీ), 2023), 

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2026), (ఎంపీఎస్సీ రాజ్యసేవ ప్రిలిమ్స్, 2025),

1) నవంబరు 20            2) మార్చి 4    3) ఫిబ్రవరి 20        4) ఏప్రిల్‌ 4

సమాధానం: 1

4. స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ చిల్డ్రన్‌ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)

1) యూఎన్‌డీపీ             2) యునెస్కో

3) యునిసెఫ్‌           4) డబ్ల్యూహెచ్‌ఓ

సమాధానం: 3

5. As per the State of the World's Children 2024, by 2050s more than a third of the world's children will live in four countries. Which of the following is NOT one of them?
(SSC CHSL Tier-1, 2025)
1) China        2) Nigeria        3) Pakistan        4) Sudan
Ans: 4
6. What rank did India secure in UNICEF’s 'The State of the World’s Children 2024' report, spotlighting the severe climate risks facing its children?
(RRB Group D, 2025)
1) 54th        2) 26th        3) 32nd        4) 11th
Ans: 2
7. Which of the following Articles of the UN's Convention on the Rights of the Child, focuses on a child's right to an education and on the quality and content of education?
(SSC CHSL Tier-1, 2025)
1) Articles 45 and 46        2) Articles 5 and 6
3) Articles 28 and 29        4) Articles 12 and 13
Ans: 3
8. As per the June 2025 India Child Protection report, what percentage of 44,902 rescued children were found in the worst forms of child labour?
(RRB Group D, 2025)
1) 50%        2) 90%        3) 60%        4) 75%
Ans: 2 
9. The United Nations Convention on the Rights of Persons with Disabilities (CRPD) catalyzed a pivotal paradigm shift in global perception, redefining the status of individuals with disabilities from focusing on charity and medical treatment to recognizing them as: 
(RPF Constable, 2025)
1) A vulnerable population requiring specialized social protection measures. 
2) Integral and equal members of society endowed with fundamental human rights. 
3) Individuals who require the least restrictive environment (LRE) as mandated by national law. 
4) A target group requiring vocational training for economic rehabilitation.
Ans: 2
10. 'PENCIL' is an online portal for effective enforcement of the ______.
(TGPSC AEE Paper-I, 2023)
1) New India Literacy Programme    2) New Education Policy
3) Child Labour Act            4) PM Poshan scheme
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram