భారతదేశం విభిన్న మతాలు, జాతులు, భాషలు, సంస్కృతి - సంప్రదాయాలకు నిలయం. ప్రజల మధ్య ఎన్ని భేదాలున్నా అందరం ఒకటే అనే భావనను పెంపొందించడమే జాతీయ సమైక్యత. దేశ పౌరులు మేమంతా భారతీయులం, మాది భారత జాతి అని మానసికంగా అనుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. తద్వారా దేశం సుస్థిరంగా, పటిష్ఠంగా ఉంటుంది. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మన దేశంలో ఏటా నవంబరు 19న ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా (National Integration Day) నిర్వహిస్తారు. దేశ ప్రజల్లో ఐక్యత, శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
జాతీయ సమైక్యతా మండలి (National Integration Council)
ఇందిరా గాంధీ - ముఖ్య విశేషాలు
చారిత్రక నేపథ్యం
ఇందిరా గాంధీ 1917, నవంబరు 19న ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (ప్రస్తుత అలహాబాద్)లో జన్మించారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, అందరికీ విద్య - ఆరోగ్యం లాంటి కార్యక్రమాలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. దేశాభివృద్ధితోపాటు జాతీయ సమగ్రతకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఏటా ఆమె జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా జరపాలని ప్రభుత్వం తీర్మానించింది. 1985 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
| జాతీయ సమైక్యతా మండలి ఏర్పాటు, దాని లక్ష్యాలు - అధికారాలు, ఇతర సమాచారంతోపాటు గతంలో ఏపీ హైకోర్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఖిఖి/జూ.అసిస్టెంట్/ టైపిస్ట్/ ఫీల్డ్ అసిస్టెంట్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2026)
1) ఇందిరా గాంధీ 2) ప్రతిభా పాటిల్
3) రాజకుమారి అమృత్ కౌర్ 4) సరోజినీ నాయుడు
సమాధానం: 1
2. జాతీయ సమైక్యతా మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
(యూపీ పోలీస్ ఎస్ఐ, 2021)
1) 1947 2) 1986 3) 1971 4) 1962
సమాధానం: 4
3. కిందివాటిలో ఏ రోజున ‘జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని’ జరుపుకుంటారు?
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2024), (టీఎన్పీఎస్సీ గ్రూప్-4, 2018),
(యూపీ పోలీస్ అసిస్టెంట్ ఆపరేటర్, 2024), (కేఎస్పీ పోలీస్ (ఆర్ఎస్ఐ), 2023),
(మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ (ముంబయి), 2024)
1) అక్టోబరు 2 2) ఆగస్టు 15
3) జనవరి 26 4) నవంబరు 19
సమాధానం: 4
4. కిందివాటిలో సరైన జతను ఎంచుకోండి.
(టీఎన్పీఎస్సీ గ్రూప్-4, 2012)
1) భారతీయ ప్రణాళికా పితామహుడు - గాంధీజీ
2) తమిళనాడు మొదటి గవర్నర్ - పి.సి.అలెగ్జాండర్
3) భారతదేశ మొదటి మహిళా ప్రధాని - ఇందిరా గాంధీ
4) భారతదేశ మొదటి రాష్ట్రపతి - జవహర్లాల్ నెహ్రూ
సమాధానం: 3
5. Examine the following statements related to national integration:
(i) Preamble begins with ‘We the people of India’.
(ii) Directive Principles of the Indian Constitution direct the states to take steps towards bringing equality, justice, liberty to all.
Choose the correct answer:
(Telangana Police SI Prelims, 2018)
1) Both (i) and (ii) are correct 2) Both (i) and (ii) are incorrect
3) Only (i) is correct 4) Only (ii) is correct
Ans: 3
6. After its 1971 electoral victory, Indira Gandhi’s government amended the Constitution to remove legal obstacles to abolishing which of the following privileges?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Zamindari system
2) Monopoly trade licenses
3) Privy purses of former princely rulers
4) Separate electorates for minorities
Ans: 3
7. M.M. Punchhi Committee was appointed to study Centre-State relations. Regarding Punchhi recommendations all the following statements are correct except
(APPSC Group-1Prelims, 2019)
1) Localizing the Emergency Provisions under Articles 355 and 356 either to district or part of district.
2) Deployment of Central forces without State's consent for a short period.
3) In appointing the Chief Minister, pre-poll alliance should be treated as one political party.
4) National Integration Commission shall meet once in two years
Ans: 4
8. Which Prime Minister’s 'Inner Cabinet' became particularly powerful during their era?
(RPF Constable, 2025)
1) Indira Gandhi 2) Narendra Modi
3) Jawaharlal Nehru 4) Atal Bihari Vajpayee
Ans: 1