జాతీయ పత్రికా దినోత్సవం

జాతీయ పత్రికా దినోత్సవం

ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలే పత్రికలు. ఇవి కేవలం వార్తాంశాలను తెలపడమే కాక విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తాయి. మన దేశంలో పత్రికలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో, ఉద్యమకారులను సంఘటితం చేయడంలో ఇవి ముఖ్య భూమిక పోషించాయి. ప్రస్తుత టెలివిజన్, సోషల్‌మీడియా యుగంలో పత్రికలు ప్రజలకు నిజమైన వార్తలను అందిస్తూ విశ్వసనీయతను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, స్వార్థపూరిత నాయకులను ఎండగట్టడంలో, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సామాన్యులకు అండగా నిలుస్తున్నాయి. మన దేశంలోని స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత పత్రికలను గౌరవించుకునే ఉద్దేశంతో ఏటా నవంబరు 16న ‘జాతీయ పత్రికా దినోత్సవం’గా (National Press Day) నిర్వహిస్తారు. ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను కాపాడటం; జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.ప్రపంచ దేశాల్లో జర్నలిస్టులు, మీడియాకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారంగా ఫ్రాన్స్‌ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే సంస్థ ఏటా వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది. 2026 సూచీలో మొత్తం 180 దేశాలు ఉండగా, భారత్‌ 31.96 స్కోరుతో 157వ స్థానంలో ఉంది. 2025లో మన దేశం 32.96 స్కోరుతో 151వ స్థానంలో నిలిచింది. 

  • 1556లో పోర్చుగీస్‌ వారు భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్‌ ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని గోవాలోని సెయింట్‌ పాల్స్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. మనదేశంలో ప్రచురించిన మొదటి వార్తాపత్రిక ‘ది బెంగాల్‌ గెజెట్‌’. ఐర్లాండ్‌కి చెందిన జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ 1780లో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ది బెంగాల్‌ జర్నల్, ది మద్రాస్‌ కొరియర్, ది బొంబాయి హెరాల్డ్, ది కలకత్తా క్రానికల్‌ లాంటి ఇతర వార్తా పత్రికలు ప్రారంభమయ్యాయి.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా

  • దేశంలో ప్రింట్‌ మీడియా నియంత్రణకు ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ). పత్రికా స్వేచ్ఛను కాపాడటం, పత్రికల్లో స్వీయ నియంత్రణ సూత్రాలను పెంపొందించడం లాంటి లక్ష్యాలతో భారత ప్రభుత్వం దీన్ని నెలకొల్పింది. ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం, 1978 ద్వారా ఇది అమల్లోకి వచ్చింది. ఇది చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి సంస్థ. రాజ్యాంగంలో పొందుపరిచిన భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత దీనికి అప్పగించారు.
  • ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టం, 1978లోని సెక్షన్‌ 5(3) నిబంధనల ప్రకారం పీసీఐ ఛైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుంది. ప్రస్తుతం జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ పీసీఐ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు (2026, నవంబరు 15 నాటికి). ఈమె పీసీఐకి మొదటి మహిళా ఛైర్‌పర్సన్‌. అలాగే ఆమె ఈ పదవిని వరుసగా రెండోసారి నిర్వహిస్తున్నారు. గతంలో 2022, జూన్‌ నుంచి 2025, డిసెంబరు వరకు పీసీఐ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

చారిత్రక నేపథ్యం

  • భారత్‌లో వార్తాపత్రికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన సంస్ధ లేదా కమిటీని ఏర్పాటు చేయాలని 1956లో మొదటిసారి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక కార్యనిర్వాహక సంస్థ అవసరమని భావించారు. 1966లో జస్టిస్‌ జె.ఆర్‌.ముధోల్కర్‌ నేతృత్వంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఏర్పడింది. అదే ఏడాది నవంబరు 16 నుంచి ఇది పని చేయడం ప్రారంభించింది. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన మన దేశంలో ‘జాతీయ పత్రికా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 
వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌ 2026 జాబితాలో మొదటి 10 దేశాలు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లక్ష్యాలు, సిబ్బంది, విధులు, అధికారాలతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 65కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మన దేశంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
(ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2019), (ఎస్‌ఎస్‌సీ మెట్రిక్‌ లెవల్, 2022),(బిహార్‌ సీఈటీ బీఈడీ, 2021), (యూజీసీ నెట్‌ పేపర్‌ 1, 2021),(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2026)

1) అక్టోబరు 31            2) అక్టోబరు 1

3) నవంబరు 16           4) నవంబరు 1

సమాధానం: 3

2. భారతదేశంలో మొదటి ముద్రణాలయాన్ని (ప్రింటింగ్‌ ప్రెస్‌) ఎవరు ఏర్పాటు చేశారు?
(బిహార్‌ ఎస్‌టెట్, 2023)

1) బ్రిటిష్‌ వారు                2) పోర్చుగీస్‌ వారు

3) డచ్‌ వారు                  4) ఫ్రెంచ్‌ వారు

సమాధానం: 2

3. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)లో కింది ఎవరు ఉంటారు?
(కేసెట్, 2017)

1) ఛైర్మన్, 27 మంది సభ్యులు

2) ఛైర్మన్‌ కాకుండా 28 మంది సభ్యులు

3) ఛైర్మన్, 29 మంది సభ్యులు

4) ఛైర్మన్, 28 మంది సభ్యులు

సమాధానం: 4

4. భారతదేశంలో ‘ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బుక్స్‌ యాక్ట్‌’ ఏ సంవత్సరంలో ఆమోదం పొందింది?
(ఎంపీపీఎస్సీ లైబ్రేరియన్, 2018)

1) 1867   2) 1968   3) 1854   4) 1956

సమాధానం: 1

5. Ranjana Prakash Desai who became the first woman chairperson of the Press Council of India originally worked in which of the following organs of the government?
(SSC CGL, 2024)

1) Legislature        2) Judiciary        3) Vigilance        4) Executive

Ans: 2

6. The most notable event in Indian journalism in 1948 was the formation of 
(TSPSC Steno, Typist & Junior Assistant, 2017)

1) Prasar Bharathi            2) UNI        

3) Press Trust of India         4) Press Guild

Ans: 3

7. On the occasion of World Press Freedom Day, the UNESCO conferred World Press Freedom Prize 2019 awarded to two Myanmar journalists, who reported on alleged human rights violations in Myanmar. They are
(APPSC Group 1 Prelims, 2019)

1) Wa Lone and Soe        2) Kyaw Soe Oo and Lue

3) Lue and Wa Lone        4) Kyaw Soe Oo and Wa Lone

Ans: 4

8. According to the World Press Freedom Index 2026, released by Reporters Without Borders (RSF), which country ranked 1st — a position it has now held for 10 consecutive years?
(RRB Group D, 2026)

1) Norway        2) Denmark        3) Finland        4) Sweden

Ans: 1

9. According to the Press Information Bureau, by what percentage did India's Defence Public Sector Undertakings (DPSUs) exports grow in the fiscal year 2024-25 compared to the previous year?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)

1) 42.85%        2) 50.2%        3) 25.5%        4) 35.7%

Ans: 1

10. The Press Council of India has chosen _______ for the Raja Rammohan Roy award for Excellence in Journalism in 2023.
(Telangana Police SI Mains, 2022)

1) C.H. Ramoji Rao                2) Allam Narayana

3) Anne Bhavani Koteswara Prasad        4) None of the above

Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram