బాలల దినోత్సవం

బాలల దినోత్సవం

భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకి పిల్లలంటే అమితమైన ఇష్టం. దేశ ప్రగతికి వారి విద్య, శ్రేయస్సు మూల స్తంభాలుగా నిలుస్తాయని ఆయన నమ్మారు. చిన్నారులు ఈయన్ను ‘చాచా నెహ్రూ’ అని పిలిచేవారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబరు 14న మన దేశంలో ‘బాలల దినోత్సవం’గా (Children’s Day) నిర్వహిస్తారు. బాల్యం గొప్పతనాన్ని, పిల్లల హక్కులను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పిల్లలు అంటే?

  • సాధారణంగా 14 ఏళ్లలోపు వయసున్నవారందరూ ఈ కోవలోకి వస్తారు. బాల్యం అనేది ఎదుగుదల, అన్వేషణ, అభ్యసనాలకు అత్యంత కీలకమైన కాలం. వారు పెరిగే సామాజిక, సాంస్కృతిక నేపథ్యం వారిపై ప్రభావాన్ని చూపుతుంది.
  • మన భారతీయ చట్టాల్లో పిల్లల వయసుకు సంబంధించి ఒకే సార్వత్రిక నిర్వచనం లేదు. సందర్భాన్ని బట్టి వివిధ చట్టాలు వేర్వేరు వయో పరిమితులను నిర్దేశిస్తాయి.
  • ది జువైనెల్ యాక్ట్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌), పోక్సో చట్టం ప్రకారం భారతదేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వ్యక్తిని సాధారణంగా పిల్లలుగా పరిగణిస్తారు. భారత జనాభా లెక్కల ప్రకారం, 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని బాలలుగా వర్గీకరిస్తారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ (ఆర్‌టీఈ) 6 నుంచి 14 ఏళ్ల వయసు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంటోంది.
  • భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 20 ప్రకారం, ఏడేళ్లలోపున్న పిల్లలు చేసే ఏ పని కూడా నేరంగా పరిగణించరు. ప్రపంచంలోనే అత్యధిక బాలల జనాభా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2026, జూన్‌ నాటికి మన దేశంలో 18 ఏళ్లలోపు వయసున్న వారి సంఖ్య సుమారు 47.2 కోట్లుగా ఉంది. భారతదేశంలో చిన్నారుల హక్కులకు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించారు. ఇందుకోసం మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్‌ను నిర్దేశించారు.
  • ది జువైనెల్ యాక్ట్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌), 2015 అనేది అవసరంలో ఉన్న పిల్లలకు సంరక్షణ, రక్షణను నిర్ధారిస్తుంది. ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో) యాక్ట్, 2012 అనేది ప్రతి దశలో పిల్లల శ్రేయస్సు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, 18 ఏళ్లలోపు వయసున్న బాలలను లైంగిక దాడి, వేధింపులు, అశ్లీలత నుంచి కాపాడుతుంది. 

చారిత్రక నేపథ్యం

  • జవహర్‌లాల్‌ నెహ్రూ 1889, నవంబరు 14న జన్మించారు. ఆయన ఎల్లప్పుడూ పిల్లల విద్య, హక్కుల గురించి ఆలోచించేవారు. ఈయన పుట్టినరోజున ఏటా బాలల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1957లో తీర్మానించింది. ఆ ఏడాది నవంబరు 14న మొదటిసారి దిల్లీలోని నేషనల్‌ స్టేడియంలో దీన్ని నిర్వహించారు.
  • ఐక్యరాజ్య సమితి 1954లో ప్రకటించిన తేదీ ప్రకారం మొదట్లో మన దేశంలోనూ నవంబరు 20నే బాలల దినోత్సవంగా జరిపేవారు. 
బాలల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇతర దేశాల్లో బాలల దినోత్సవం నిర్వహించే తేదీలు, గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 120కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది ఎవరి జయంతిని పురస్కరించుకుని ఏటా మన దేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుతారు?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ 2024), (పీఎస్‌పీసీఎల్‌ జేఈ సివిల్, 2012), (ఎంపీ పట్వారీ, 2017), (యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రీ-ఎగ్జామ్, 2024)

1) ఏపీజే అబ్దుల్‌ కలాం        2) పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ

3) బీఆర్‌ అంబేడ్కర్‌            4) సర్వేపల్లి రాధాకృష్ణన్‌

సమాధానం: 2

2. యునిసెఫ్‌ ప్రకారం, ప్రపంచ బాలల దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ నేచురల్‌ సైన్స్, 2018)

1) నవంబరు 20                2) అక్టోబరు 27

3) డిసెంబరు 14                4) నవంబరు 14

సమాధానం: 1

3. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఎ దేనికి సంబంధించింది?
(కేరళ సెట్‌ పేపర్‌ 1, 2016)

1) బాలకార్మిక వ్యవస్థ నిషేధం        2) విద్యా హక్కు

3) దివ్యాంగుల చట్టం                4) బాలల హక్కులు

సమాధానం: 2

4. ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఐసీడీఎస్‌) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
(హెచ్‌పీఎస్‌ఎస్‌సీ స్టాఫ్‌ నర్స్, 2021)

1) 1970   2) 1975   3) 1992   4) 1995

సమాధానం: 2

5. The Ministry of Women and Child Development celebrated the 8th edition of Poshan Pakhwada from 9 to 23 April 2026. What was the theme of Poshan Pakhwada 2026?
(RRB Group D, 2026)

1) Enhancing community participation for holistic nutrition outcomes

2) Strengthening adolescent nutrition and healthy lifestyle habits

3) Maximizing brain development in the first six years of life

4) Promoting maternal health and early childhood care services

Ans: 3

6. What is the primary objective of the NPS Vatsalya scheme launched in 2024?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)

1) To replace the existing National Pension System (NPS) for all age groups

2) To support pension benefits for unorganised sector workers

3) To offer a savings-cum-pension plan exclusively for minors

4) To provide old-age pension to senior citizens living in rural areas

Ans: 3

7. Consider the following statements about NPS Vatsalya:
(i) It allows partial withdrawal up to 25% of own contributions for specific needs.
(ii) NRIs and OCIs under 18 may join the scheme.
(iii) Fresh KYC is mandatory when the minor turns 18.
Which statements are correct?
(SSC GD Constable, 2026)
1) i only        2) i and ii        3) i and iii        4) ii and iii        5) i, ii and iii

Ans: 5

8. In September 2024, the Finance Minister of India launched which new pension scheme designed specifically for minors?
(RPF Constable, 2025)

1) PM Vaya Vandana Yojana    2) NPS Vatsalya

3) Sishu Pension Yojana        4) Atal Pension Yojana

Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram