భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన ఈ పదవిలో చాలా కాలం పనిచేశారు. దేశంలో విద్యాభివృద్ధికి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా నవంబరు 11న ‘జాతీయ విద్యా దినోత్సవం’గా (National Education Day) నిర్వహిస్తారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం; దేశ ప్రగతి, వ్యక్తిగత శ్రేయస్సులో చదువు పోషించే పాత్ర గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
అబుల్ కలాం ఆజాద్
1888, నవంబరు 11న సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1947 నుంచి 1958 వరకు మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. దేశంలో విద్యా వ్యాప్తికి అనేక చర్యలు చేపట్టారు. ఈయన హయాంలోనే 1948లో రాధాకృష్ణన్ అధ్యక్షతన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1954లో యూజీసీని నెలకొల్పారు. 1964లో డీఎస్ కొఠారి అధ్యక్షతన ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పడింది. ఈయన 1958, ఫిబ్రవరి 22న దిల్లీలో మరణించారు.
చారిత్రక నేపథ్యం
దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ భారత్‌లో విద్యాభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టారు. సంస్కరణలు తీసుకొచ్చారు. ఈయన సేవలను గుర్తుంచుకునే ఉద్దేశంతో ఏటా ఆయన జన్మదినాన్ని ‘జాతీయ విద్యా దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం 2008, సెప్టెంబరులో తీర్మానించింది. అదే ఏడాది నవంబరు 11 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
|
ఆంగ్లేయుల కాలంలో విద్యాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు, మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్, దేశంలో విద్యారంగ అభివృద్ధికి ఏర్పాటైన వివిధ కమిటీలు/ కమిషన్లు తదితర పూర్తి సమాచారంతోపాటు గతంలో ఈ టాపిక్ నుంచి ఎస్‌ఎస్‌సీ, రైల్వే, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారత విద్యా కమిషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
(ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ పీటీఐ, 2015)
1) 1890 2) 1882 3) 1990 4) 2000
సమాధానం: 2
2. స్వాతంత్య్ర కాలం నాటి విధానాలు, వ్యక్తుల గురించి అంతర్‌దృష్టిని అందించే ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
(దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2026)
1) జవహర్‌లాల్ నెహ్రూ 2) సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
3) మహాత్మా గాంధీ 4) అబుల్ కలాం ఆజాద్
సమాధానం: 4
3. జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీఎస్సీ మెయిన్స్, 2019), (బిహార్ సీఈటీ బీఈడీ, 2016),
(ఎంఎస్‌టెట్ వర్గ్ 2 సోషల్ సైన్స్, 2019), (బీఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022),
(యూపీ పోలీస్ కానిస్టేబుల్, 2018), (యూజీసీ నెట్ పేపర్ 1, 2021),
(ఎన్‌వీఎస్ మెస్ హెల్పర్, 2022), (వైజాగ్ ఎంటీ మెకానికల్, 2017),
(పీఎస్‌పీసీఎల్ ఎల్‌డీసీ, 2019), (కేవీస్ పీఆర్‌టీ, 2013),
1) జనవరి 3 2) సెప్టెంబరు 5
3) అక్టోబరు 15 4) నవంబరు 11
సమాధానం: 4
4. కింది ఏ భారతీయ నాయకుడి పుట్టినరోజును పురస్కరించుకుని మన దేశంలో నవంబరు 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తారు?
(తెలంగాణ హైకోర్ట్ రికార్డ్ అసిస్టెంట్, 2025),
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021), (బిహార్ ఎస్‌ఈటీ పేపర్ 1: హిందీ, 2020),
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీఆర్‌టీ, 2026), (యూపీ పోలీస్ ఏఎస్‌ఐ, 2021),
(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2021), (ఓఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022),
(బిహార్ సీఈటీ బీఈడీ, 2018)
1) సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) ఏపీజే అబ్దుల్ కలాం
3) సుభాష్‌చంద్ర బోస్ 4) మౌలానా అబుల్ కలాం ఆజాద్
సమాధానం: 4
5. Who among the following was NOT one of the founders of the Ahrar Movement in British India?
(SSC Stenographer, 2024)
1) Maulana Muhammad Ali 2) Hasan Imam
3) Hakim Ajmal Khan 4) Maulana Abul Kalam Azad
Ans: 4
6. Maulana Abul Kalam Azad, a supporter of Hindu-Muslim unity, became the _____ in the first cabinet of independent India.
(RPF Constable, 2025)
1) Finance Minister 2) Education Minister
3) Law Minister 4) Defense Minister
Ans: 2
7. Which Constitutional Amendment made education a subject in the Concurrent List, allowing both Parliament and State Legislatures to legislate on educational matters and harmonize policies nationwide?
(Delhi Police Constable (Executive), 2025)
1) 42nd 2) 86th 3) 44th 4) 73rd
Ans: 1
8. The State shall provide free and compulsory education to all children of the age of six to fourteen years in such a manner as the state may, by law, determine" is part of
(Telangana Police SI Prelims, 2022)
1) Right to Equality 2) Right against Exploitation
3) Right to Freedom of Religion 4) Right to Freedom
Ans: 4