శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం

శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం

సైన్స్‌ ఎంత పురోగమిస్తే అంతే వేగంగా మానవాభివృద్ధి జరిగి ఫలితంగా దేశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. విద్య, ఆరోగ్యం, రక్షణ, వ్యాపారం లాంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలకు, అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పాటు అందిస్తోంది. సమాజాభివృద్ధిలో సైన్స్‌ పాత్రను గుర్తించడంతోపాటు దాని వల్ల కలిగే దుష్ప్రభావాలపైనా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న ‘శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం’గా (World Science Day For Peace And Development) నిర్వహిస్తారు. విజ్ఞానశాస్త్రంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలియజేయడం; శాంతిని పెంపొందించడంలో, స్థిడిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రకారం, భారతదేశం 2010లో శాస్త్రీయ పరిశోధనల్లో ప్రపంచంలో 7వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ పరిశోధనా పత్రాల ప్రచురణలో 2012లో 78,135 ప్రచురణలు చేయగా, ఈ సంఖ్య గణనీయంగా పెరిగి 2022 నాటికి 2,70,390కి చేరింది. సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో అందించే పీహెచ్‌డీల్లో అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.

  • 2026 నాటికి భారత్‌ పేటెంట్‌ ఫైలింగ్‌లో ఆరోస్థానంలో ఉంది. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) ప్రకారం, 2016లో 450కి పరిమితమైన స్టార్టప్‌ల సంఖ్య 2026, మార్చి 31 నాటికి నాటికి 2,23,000కు చేరింది. అదే సమయంలో నమోదిత, క్రియాశీల సంస్థలన్నింటినీ కలుపుకుంటే మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 8,36,451.
  • హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2026 ప్రకారం, భారత్‌ 61 యూనికార్న్‌ స్టార్టప్‌లతో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. 100 బిలియన్‌ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌ సంస్థలను యూనికార్న్‌లుగా పేర్కొంటారు. 2014లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో భారత్‌ 81వ స్థానంలో ఉండగా, 2026లో 139 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ 38వ ర్యాంక్‌కు చేరుకుంది.

చారిత్రక నేపథ్యం

  • యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో), ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ సంయుక్తంగా 1999, జూన్‌ 25 నుంచి జులై 1 వరకు హంగేరీలోని బుడాపెస్ట్‌లో మొదటి ప్రపంచ శాస్త్రీయ సమావేశాన్ని (వరల్డ్‌ సైంటిఫిక్‌ కాన్ఫరెన్స్‌) నిర్వహించాయి. అందులో సైన్స్‌ కోసం ఒక రోజును ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
  • విజ్ఞానశాస్త్రం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు దేశాలు, ప్రాంతాల మధ్య నెలకొన్న సంఘర్షణలను రూపుమాపి, శాంతిని నెలకొల్పేలా శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న ‘శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం’గా జరుపుకోవాలని యునెస్కో జనరల్‌ అసెంబ్లీ 2001లో తీర్మానించింది. 2002 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.

2026 నినాదం: Common ground through science diplomacy.

సైన్స్‌ (విజ్ఞానశాస్త్రం) - చరిత్ర, సీఎస్‌ఐఆర్, ఇస్రో, డీఆర్‌డీవో తదితర సంస్థల ఏర్పాటు, ఇతర ముఖ్య సమాచారంతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. సహజ, భౌతిక ప్రపంచం గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?

(ఎంపీ ఐటీఐ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ ఎలక్ట్రీషియన్, 2022)

1) విజ్ఞానశాస్త్రం                2) వ్యాపార అధ్యయనాలు

3) గణితం                   4) అర్థశాస్త్రం

సమాధానం: 1

2. ప్రకృతికి సంబంధించిన విజ్ఞానశాస్త్రం అందించే విలువ ఏమిటి?

(యూపీటెట్, 2016)

1) సంభావ్యత            2) వాస్తవికత

3) తాత్కాలికత           4) అనిశ్చితి

సమాధానం: 2

3. శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ప్రహారి కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023), 

(సీఐఎల్‌ ఎంటీ సివిల్, 2020), (పీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2024),

1) నవంబరు 1                    2) నవంబరు 10

3) నవంబరు 20                   4) నవంబరు 30

సమాధానం: 2

4. ప్రతి సంవత్సరం నవంబరు 10న జరుపుకునే ‘ శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవాన్ని’ మొదటిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019)

1) 2000    2) 2002        3) 2004    4) 2006

సమాధానం: 2

5. The National Science Centre, Delhi, celebrated World Earth Day 2026 on April 22 based on which official global theme?
(RRB Group D, 2026)
1) Our Power, Our Planet                2) Restore Our Earth
3) Climate Action for Future Generations        4) Invest in Our Planet
Ans: 1
6. Scientists around the world use a common standard unit so that measurements of mass are consistent and comparable. Which SI unit serves this purpose?
(RRB Technician Grade I, 2026)
1) Tonne        2) Kilogram            3) Pound            4) Gram
Ans: 2
7. Based on current scientific knowledge, it is currently postulated that the Earth has an estimated age of:
(SSC CGL Tier-II, 2023)
1) about 4,50,00,00,000 years        2) about 95,00,00, 00 years
3) about 45,00,000 years            4) about 65,00,000 years
Ans: 1
8. A science teacher Peter Tabichi has won the prestigious Global Teacher Prize 2019, which honours the world's best teacher. He belongs to
(APPSC Group 1 Prelims, 2019)
1) UK            2) South Africa        3) Kenya        4) Zambia
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram