పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్య రక్షణలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయి. మానవ కార్యకలాపాల ఫలితంగా వీటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మొక్కలు, జంతువులు ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వాటిని రక్షించేందుకు ఏర్పాటు చేసినవే బయోస్పియర్ రిజర్వ్‌లు (జీవావరణ కేంద్రాలు). వీటి గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 3న ‘అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం’గా (International Day For Biosphere Reserves) నిర్వహిస్తారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో జీవావరణ కేంద్రాల ప్రాముఖ్యతను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
భారత్‌లోని బయోస్పియర్ రిజర్వ్‌లు
మన దేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్‌లు ఉన్నాయి. ఇవి 91,428 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో 13 యునెస్కోకు చెందిన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ (డబ్ల్యూఎన్బీఆర్) గుర్తింపు పొందాయి. ఈ రిజర్వ్‌లు పర్వతాలు, అడవుల నుంచి తీరప్రాంతాలు, ద్వీపాల వరకు విభిన్న భూభాగాల్లో విస్తరించి ఉన్నాయి.
నీలగిరి బయోస్పియర్ రిజర్వ్
ఇది భారతదేశ మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్. విస్తీర్ణం 5520 చ.కి.మీ. దీన్ని భారత ప్రభుత్వం 1986లో ప్రకటించగా, 2000లో యునెస్కో గుర్తింపు పొందింది. ఇది పశ్చిమ కనుమల్లోని తమిళనాడు, కేరళం, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇందులో కొండలు, లోయలు, గడ్డి మైదానాలు, అడవులు ఉన్నాయి.
పన్నా బయోస్పియర్ రిజర్వ్
ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. విస్తీర్ణం 2998 చ.కి.మీ. అడవులు, చిత్తడి నేలలు, నదులు, అనేక రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఇందులో పన్నా నేషనల్ పార్క్, గంగావ్ అభయారణ్యంలోని కొన్ని భాగాలు ఉన్నాయి. 2011లో ప్రభుత్వం ప్రకటించగా 2020లో యునెస్కో గుర్తింపు దక్కింది.
చారిత్రక నేపథ్యం
యునెస్కో 1971, నవంబరు 3న మాన్ అండ్ ది బయోస్పియర్ (ఎంఏబీ) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. 2021 నవంబరు 9 నుంచి 24 మధ్య పారిస్‌లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 41వ సమావేశం జరిగింది. ఎంఏబీ ప్రోగ్రాం ప్రారంభమై 50 ఏళ్లయిన సందర్భంగా ఏటా నవంబరు 3న ‘అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం’గా జరుపుకోవాలని ఆ సమావేశంలో తీర్మానించారు. 2022 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
| నందా దేవి, నక్రెక్, గ్రేట్ నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ సహా దేశంలోని మిగతా బయోస్పియర్ రిజర్వ్‌ల సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2/ జూ.అసిస్టెంట్/ టైపిస్ట్/ ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఎస్ఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఒక బయోస్పియర్ రిజర్వ్‌ను ఎన్ని మండలాలుగా విభజించారు?
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2017)
1) అయిదు 2) నాలుగు 3) ఆరు 4) మూడు
సమాధానం: 4
2. కిందివాటిలో ఏది వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో భాగం?
(ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, 2019)
1) దిబ్రూషైకోవా 2) యూకలిప్టస్
3) దిహాంగ్ - దిబాంగ్ 4) కోల్డ్ డిజర్ట్
సమాధానం: 4
3. అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుతారు?
(యూజీసీ నెట్ పేపర్ 1, 2025), (ఓపీఎస్సీ ఓఏఎస్, 2022),
(ఆర్ఆర్బీ గ్రూప్ డి, 2026), (ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (యూజీ), 2025)
1) ఫిబ్రవరి 2 2) ఏప్రిల్ 22
3) నవంబరు 3 4) సెప్టెంబరు 16
సమాధానం: 3
4. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్‌కు ఏ సంస్థ గుర్తింపు ఇస్తుంది?
(యూపీ పోలీస్ ఎస్ఐ, 2021)
1) ఐయూసీఎన్ 2) డబ్ల్యూడబ్ల్యూఎఫ్
3) ఎఫ్ఏఓ 4) యునెస్కో
సమాధానం: 4
5. As of the June 2021, how many biosphere reserves are established in India?
(SSC CGL Tier-I, 2024)
1) 18 2) 20 3) 26 4) 15
Ans: 1
6. What is the correct sequence of the following Biosphere Reserves of India from east to west?
i. Sunderban
ii. Pachmarhi
iii. Achanakmar-Amarkantak
iv. Similipal
(RPF SI CBT-I, 2024)
1) i, iii, iv, ii 2) i, iv, iii, ii 3) iv, ii, iii, i 4) ii, iii, iv, i
Ans: 2
7. Consider the following statements about India's Biosphere Reserves:
i. All biosphere reserves are notified as UNESCO World Heritage Sites.
ii. Gulf of Mannar and Great Nicobar are included in the World Network of Biosphere Reserves.
iii. Biosphere reserves often include core, buffer, and transition zones.
(SSC Selection Post (Graduate Level), 2025)
1) Only i and ii are correct 2) Only ii and iii are correct
3) Only i and iii are correct 4) All i, ii and iii are correct
Ans: 2
8. Which of the following statements regarding biosphere reserves in India are correct?
i. The ‘Nilgiri’ is the first biosphere reserve of India.
ii. The Nanda Devi Biosphere Reserve is situated in Uttarakhand.
iii. The Cold Desert Biosphere Reserve is situated in Himachal Pradesh.
(AP High Court Stenographer Grade III/ Jr Assistant/ Typist/ Field Assistant, 2025)
1) Only i and ii 2) i, ii and iii
3) Only i and iii 4) Only ii and iii
Ans: 2