ప్రపంచ నగరాల దినోత్సవం

ప్రపంచ నగరాల దినోత్సవం

దేశాభివృద్ధిలో నగరాలదే కీలక భూమిక. ఇవి ఆర్థిక, రాజకీయ, పరిపాలనకు కేంద్రాలు. గ్రామాల నుంచి వలసలు పెరగడంతో నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ వనరులు తగ్గి, జనాభా పెరుగుతోంది. ఫలితంగా మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, సామాజిక సేవలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 31న ‘ప్రపంచ నగరాల దినోత్సవం’గా (World Cities Day) నిర్వహిస్తారు. పట్టణీకరణ వల్ల తలెత్తే సవాళ్లను పరిష్కరించడంతోపాటు స్థిరమైన నగరాల అభివృద్ధికి దోహదపడటంలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • ప్రపంచ స్థాయి ఆర్థిక సలహా సంస్థ ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ 2026, సెప్టెంబరు 29న ‘గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ 2026’ను విడుదల చేసింది. ఈ సూచీ అయిదు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచవ్యాప్తంగా 1000 నగరాలకు ర్యాంకులు ఇచ్చింది. అవి: ఆర్థిక వ్యవస్థ (Economics), మానవ మూలధనం (Human Capital), జీవన ప్రమాణాలు (Quality of Life), పర్యావరణం (Environment), పాలన (Governance).
  • ‘గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌ 2026’లో న్యూయార్క్‌ (అమెరికా) మొదటి స్థానంలో ఉండగా తర్వాతి ర్యాంకుల్లో వరుసగా లండన్‌ (యూకే), పారిస్‌ (ఫ్రాన్స్‌), సియాటెల్‌ (అమెరికా), శాన్‌ ఫ్రాన్సిస్కో (అమెరికా) నిలిచాయి. ఈ ఇండెక్స్‌లో సుమారు 100 భారతీయ నగరాలు చోటు పొందాయి. దిల్లీ 268 ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇతర నగరాలు: బెంగళూరు (311), ముంబయి (330), చెన్నై (381), హైదరాబాద్‌ (421), పుణె (427).
  • ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 నగర ఆర్థిక వ్యవస్థల జాబితాలో 55 భారతీయ నగరాలు చోటు పొందాయి. ప్రస్తుతం దిల్లీ ప్రపంచంలో 63వ అతిపెద్ద నగర ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్లు సూచీ పేర్కొంది. మానవ మూలధన విభాగంలో మన దేశంలో దిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఇది టొరంటో, సియోల్, బీజింగ్‌ కంటే ముందుండి ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది.
  • మన దేశ పట్టణీకరణను పరిశీలిస్తే 1901లో పట్టణ జనాభా 10% ఉండగా 1951లో 17.5%, 2001లో 27.8%, 2011లో 31%కి పెరిగింది. 2030 నాటికి 40% పైగా ఉంటుందని అంచనా. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాలను మెట్రోపాలిటన్‌ సిటీస్‌ లేదా మహానగరాలుగా పేర్కొంటారు. 1901 నాటికి మన దేశంలోని ఒకే ఒక్క మహానగరం కోల్‌కతా.   

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, నగరాల స్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, దాని ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి భావించింది. ఇందుకోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకుంది. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఏటా అక్టోబరు 31న ప్రపంచ నగరాల దినోత్సవాన్ని జరుపుకోవాలని 2013, డిసెంబరు 27న తీర్మానించింది. 2014 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

మన దేశంలో నగరాల వర్గీకరణ, భారతదేశ నగరాలు - మారు పేర్లు తదితర సమాచారంతోపాటు ఈ టాపిక్‌ నుంచి ఎస్‌ఎస్‌సీ - సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో జనాభా పరిమాణం ఆధారంగా నగరాలను ఎన్ని వర్గాలుగా విభజించారు?

(సీజీపీఎస్సీ ప్రిలిమ్స్, 2025)

1) 3   2) 4   3) 5   4) 6

సమాధానం: 4

2. కింది వాటిలో ఏ నగరాన్ని ‘స్పేస్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు?

(ఏఎఫ్‌సీఏటీ, 2020)

1) హైదరాబాద్‌              2) బెంగళూరు

3) న్యూదిల్లీ                 4) కోల్‌కతా

సమాధానం: 2

3. ప్రపంచ నగరాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

(ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2023), (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020),

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌-1, 2021), (ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025)

1) సెప్టెంబరు 4                    2) అక్టోబరు 31

3) ఆగస్టు 7                       4) నవంబరు 4

సమాధానం: 2

4. భారతదేశంలో టైర్‌-1 నగరానికి ఉదాహరణ?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2025)

1) జైపూర్‌                 2) అమృత్‌సర్‌

3) కోల్‌కతా                4) భోపాల్‌

సమాధానం: 3

5. As per the United Nations-Habitat's World Cities Report 2022, India's urban population is estimated to stand at _________________ in 2035.
(IBPS Clerk Mains,  2022)
1) 775 Million        2) 675 Million        3) 575 Million
4) 475 Million        5) 375 Million
Ans: 2
6. In the Indian context, population growth in Class I cities is the most influenced by _____. 
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) natural increase         2) migration from rural areas
3) religious factors        4) government employment
Ans: 2
7. Which city is famously known as the 'Silicon Valley of India'?
(Delhi Police Constable (Executive) 2025)
1) Mumbai        2) New Delhi        3) Hyderabad        4) Bengaluru
Ans: 4
8. Which of the following states had the highest level of urbanization in India as per the 2011 Census? 
(SSC CPO, 2025)
1) Kerala        2) Goa        3) Tamil Nadu        4) West Bengal
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram