ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఒక అంతర్జాతీయ సంస్థ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో సంభవించే సంఘర్షణలను నివారించే లక్ష్యంతో ఇది ఏర్పడింది. ప్రపంచశాంతి పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, వివిధ సమస్యలను శాంతియుతంగా - చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మొదలైన విషయాలపై ఐరాస ప్రధానంగా దృష్టిసారిస్తుంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా అక్టోబరు 24న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా (United Nations Day) నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అంతర్జాతీయ సహకారం, సంఘీభావాన్ని పెంపొందించడంలో ఐరాస కృషిని తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. దీని నిర్మాణానికి అవసరమైన భూమిని జాన్.డి.రాక్ఫెల్లర్ సమకూర్చారు. ఐరాస అధికార భాషలు ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, అరబిక్, స్పానిష్, చైనీస్. ఇది మీ ప్రపంచం (It's your world) అనేది ఐరాస నినాదం. దీని జెండాను 1947, అక్టోబరు 20న సాధారణ సభ ఆమోదించింది. జెండా వెనుకభాగం మొత్తం లేత నీలంరంగులో, దానిపై తెల్లటి గ్లోబ్ ఉంటుంది.
ఐక్యరాజ్యసమితి చార్టర్
ఇది ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఏర్పాటుకు మూలాధారమైన, చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం. ఇది యూఎన్ నిర్మాణం, అధికారాలు, సూత్రాలను నిర్దేశిస్తుంది. 1945, జూన్ 26న శాన్ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై దీన్ని రూపొందించి, సంతకాలు చేశాయి. ఇందులో పోలండ్ పాల్గొన లేదు. తర్వాత చార్టర్‌పై సంతకం చేసి, 51వ సభ్యదేశంగా చేరింది.
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు
ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో 6 ప్రధాన విభాగాలతోపాటు దానికి అనుబంధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయా సంస్థలు పనిచేస్తాయి. వీటన్నింటికీ వాటి సొంత సభ్యత్వం, నాయకత్వం, బడ్జెట్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి: యునిసెఫ్, యునెస్కో, యూఎన్ఐడీఓ, ఎఫ్ఏఓ, డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ, యూఎన్ఈపీ, ఐఏఈఏ, ఐఎఫ్ఏడీ మొదలైనవి.
చారిత్రక నేపథ్యం
1945, జూన్ 26న శాన్ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించి, సంతకాలు చేశాయి.1945 అక్టోబరు 24న ఇది అధికారికంగా అమలై ఐక్యరాజ్య సమితి ఉనికిలోకి వచ్చింది. దీని ఏర్పాటుకు గుర్తుగా 1948 నుంచి ఏటా అక్టోబరు 24న ‘ఐక్యరాజ్యసమతి దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.
యూఎన్ విధులు, దాని ఏర్పాటు - పరిణామక్రమం, ప్రధాన అంగాలు, ఇప్పటివరకు ఐరాసకు సెక్రటరీ జనరల్స్‌గా పనిచేసిన వారి వివరాలు లాంటి ముఖ్య సమాచారంతోపాటు గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 175కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978
|
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఐక్యరాజ్యసమితిలో ఎన్ని అంగాలు ఉన్నాయి?
(డీఎస్ఎస్ఎస్బీ టీజీటీ సోషల్ సైన్స్, 2021)
1) 5 2) 6 3) 7 4) 4
సమాధానం: 2
2. ఐక్యరాజ్య సమితి నినాదం ఏమిటి?
(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2022)
1) ఇది మీ ప్రపంచం (It's your world) 2) అందరికీ జీవనం (Life for all)
3) శాంతి (Peace) 4) యుద్ధం వద్దు (No war)
సమాధానం: 1
3. ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీ పట్వారీ, 2017), (ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ (టెక్నికల్), 2021),
(ఎంపీ ఎక్సైజ్ కానిస్టేబుల్, 2025), (ఆర్ఆర్బీ గ్రూప్ డి, 2025),
(యూపీఎస్ఎస్స్సీ పీఈటీ, 2021), (ఎన్టీపీసీ సీబీటీ, 2021),
(ఎస్ఎస్సీ జీడీ, 2021), (ఎస్ఎస్సీ స్టెనో, 2019)
1) అక్టోబరు 24 2) అక్టోబరు 20
3) అక్టోబరు 15 4) అక్టోబరు 17
సమాధానం: 1
4. ఐక్యరాజ్యసమితిని ఎక్కడ స్థాపించారు?
(యూకేఎస్ఎస్ఎస్సీ ఫారెస్ట్ గార్డ్, 2021)
1) జెనీవా 2) శాన్ఫ్రాన్సిస్కో
3) ది హేగ్ 4) పారిస్
సమాధానం: 2
5. What colors is the flag of the United Nations?
(Supreme Court Junior Court Assistant, 2025)
1) Blue and red 2) White and red
3) Red and green 4) Blue and white
Ans: 4
6. Which organ of the UN has the power to recommend the admission of new member States?
(UP PGT (Civics), 2026)
1) Economic and Social Council 2) Secretariat
3) General Assembly 4) Security Council
Ans: 4
7. What was the theme of United Nations Day 2025, celebrated on 24 October 2025?
(DSSSB Court Attendant, 2026)
1) Building Our Future Together
2) Global Partnership for Development
3) Reaffirming Human Rights
4) Peace and Security for All
Ans: 1
8. On which date the United Nations Organisation came into existence?
(UGC NET Paper 2: Law, 2025)
1) 20th October, 1945 2) 24th October, 1945
3) 10th December, 1948 4) 10th December, 1945
Ans : 2