ఆయుర్వేద దినోత్సవం

ఆయుర్వేద దినోత్సవం

ఆయుర్వేదం అనేది భారతదేశ ప్రాచీన వైద్య విధానం. ఇది శరీర సమతౌల్యత, ఆహారం, జీవనశైలి, మూలికలు, నివారణాత్మక సంరక్షణ (preventive care) లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సహజసిద్ధమైన వనమూలికలు, వంటలో ఉపయోగించే దినుసులు, ప్రకృతిలో లభించే వివిధ పదార్థాల సమ్మిళితమే ఆయుర్వేదం. ఇతర వైద్య సేవలకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది. అంతేకాక అనేక అనారోగ్య సమస్యలకు ఈ సంప్రదాయ వైద్యం చక్కగా పనిచేస్తుందన్న నమ్మకం ప్రజల్లో నానాటికీ పెరుగుతోంది. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో 2025 నుంచి ఏటా సెప్టెంబరు 23న ‘ఆయుర్వేద దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని గౌరవించడంతోపాటు మన రోజువారీ జీవితంలో ఆయుర్వేద ఉపయోగంపై అవగాహన కల్పించి, అందరూ దీన్ని ఆచరించేలా చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • మన వేదాల్లో ముఖ్యంగా అధర్వణ వేదంలో ఆయుర్వేద ప్రస్తావన ఉంది. వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి 114కు పైగా ఆయుర్వేద చికిత్సల గురించి ఇది వివరిస్తుంది. ఆయుర్వేదం అనేది ఆయువు (జీవితం), వేదం (జ్ఞానం) అనే సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది. దీని అర్థం జీవన శాస్త్రం. ఇది సమస్త జీవరాశులకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
  • ఆయుర్వేదం కేవలం ఒక వైద్య విధానమే కాదు. ఇది సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మిక వికాసాన్ని లక్ష్యంగా చేసుకునే జీవన విధానం కూడా. ఆయుర్వేదాన్ని కింది విధంగా విభజిస్తారు. 1) నర ఆయుర్వేదం: మానవ జీవితం, ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. 2) సత్వ ఆయుర్వేదం: జంతువుల ఆరోగ్యం, వ్యాధులకు సంబంధించింది. 3) వృక్ష ఆయుర్వేదం: మొక్కల పెరుగుదల, ఆరోగ్యం, వ్యాధులపై దృష్టిసారిస్తుంది.
  • సుశ్రుతుడు రచించిన ‘సుశ్రుత సంహిత’, చరకుడు రాసిన ‘చరక సంహిత’ లాంటి ఆయుర్వేద మూల గ్రంథాలు ఆయుర్వేద వైద్యం, శస్త్రచికిత్సకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా వివరిస్తాయి. క్రీ.శ.4వ శతాబ్దంలో గుప్తుల కాలం ఆయుర్వేదానికి స్వర్ణయుగంగా నిలిచింది. ఈ సమయంలో అనేక ఆయుర్వేద విశ్వవిద్యాలయాలు స్థాపించారు. వైద్య గ్రంథాలను ఇతర భాషల్లోకి అనువదించారు.
  • కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదానికి విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పిసోంది. దీని పరిధిలో ఆయుర్వేదంతోపాటు యునాని, సిద్ధ, యోగ, హోమియోపతి, నేచురోపతి లాంటి దేశీయ వారసత్వ, సంప్రదాయ వైద్య విధానాలున్నాయి. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ప్రకారం 2026, జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 3800 కంటే ఎక్కువ ఆయుష్‌ ఆసుపత్రులుండగా, వాటిలో దాదాపు 80శాతం ఆయుర్వేద అసుపత్రులే.
  • 1971 నాటి భారత వైద్య మండలి చట్టం ఆయుర్వేద, యునాని, సిద్ధ వైద్య విధానాలకు అధికారిక గుర్తింపును అందించి, ప్రామాణీకరణ, నియంత్రణను నిర్ధారిస్తుంది. ఆయుర్వేద వైద్యులు రిజిస్టర్డ్‌ వైద్య నిపుణులు. వీరు ఆయుర్వేద వైద్యంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ ఇన్‌ సర్జరీ (బీఏఎంఎస్‌) లాంటి గుర్తింపు పొందిన డిగ్రీని కలిగి ఉంటారు. వీరికి సంప్రదాయ భారతీయ వైద్యం చేయడానికి లైసెన్స్‌ ఉంటుంది. 

చారిత్రక నేపథ్యం

మన దేశంలో ధన్వంతరిని వైద్యశాస్త్ర పితామహుడిగా, దేవతల వైద్యుడిగా పేర్కొంటారు. ఆయుర్వేదాన్ని భారత జాతికి అందించిన ఘనత కూడా ఆయనదే. అందుకే ఈయన జయంతిని ‘ఆయుర్వేద దినోత్సవం’గా జరుపుకోవాలని 2016లో కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. 2025 నుంచి ప్రతిసంవత్సరం నిర్దిష్టంగా సెప్టెంబరు 23న ‘ఆయుర్వేద దినోత్సవం’గా జరపాలని ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, ఆర్‌ఆర్‌బీ - గ్రూప్‌-డి, ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 60కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. దేశీయ వైద్య విధానమైన ఆయుర్వేదం మూలాలను కింది ఏ వేదంలో చూడొచ్చు?

(యూజీసీ నెట్, 2020)

1) రుగ్వేదం     2) యజుర్వేదం

3) సామవేదం   4) అధ్వరణ వేదం

సమాధానం: 4

2. భారతదేశ మొదటి ‘ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద’ను కింది ఏ నగరంలో ఏర్పాటు చేశారు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) జైపూర్‌             2) పట్నా        3) సూరత్‌     4) న్యూదిల్లీ

సమాధానం: 4

3. ఆయుర్వేద దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2025),

(ఓఎస్‌ఎస్‌సీ ఏఈ ప్రిలిమ్స్, 2025)

1) జూన్‌ 21                           2) ఆగస్టు 23

3) సెప్టెంబరు 23                       4) డిసెంబరు 21

సమాధానం: 3

4. కింది ఎవరు ఆయుర్వేద పితామహుడిగా ప్రసిద్ధి చెందారు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2026)

1) చరకుడు                  2) వాసుదేవుడు

3) సుశ్రుతుడు                4) నాగార్జునుడు

సమాధానం: 1

5. What was the theme for Ayurveda Day, 2025, as announced by the Ministry of Ayush?
(RRB Group D, 2025)
1) Ayurveda for People & Planet    2) Traditional Remedies in Modern Times
3) Ayurveda for Wellness            4) Ayurveda, Environment & You
Ans: 1
6. In which of the following states two Ayurveda Institutes were started on the 5th Ayurveda Day?
(SSC GD, 2021)
1) Rajasthan and Gujarat        2) Maharashtra and Karnataka
3) Punjab and Haryana        4) Uttar Pradesh and Andhra Pradesh
Ans: 1
7. Which among the following states hosted the 9th World Ayurveda Congress & Arogya Expo in December 2022?
(SSC CHSL Tier-I, 2023)
1) West Bengal        2) Goa        3) Maharashtra        4) Rajasthan
Ans: 2
8. Ayurvedic system of health __________.
(Agniveer Navy SSR, 2025)
1) does not care about the environment
2) believes in destroying the environment
3) is ecology conscious
4) pollutes the environment
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram