జాతీయ అంతరిక్ష దినోత్సవం

జాతీయ అంతరిక్ష దినోత్సవం

అమెరికా, రష్యాల కంటే కాస్త ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన భారత్‌ చంద్రయాన్‌-3 ప్రయోగంతో చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫీగా దింపిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ (రష్యా), చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. అంతేకాక చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి ల్యాండర్, రోవర్‌ను పంపిన మొదటి దేశంగా భారత్‌ అవతరించింది. ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా (National Space Day) నిర్వహిస్తారు. అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్‌-3 విజయాన్ని స్మరించుకోవడంతోపాటు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

అంతరిక్షం అంటే?

  • భూమి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ‘అంతరిక్షం’ లేదా ‘ఖగోళం’ లేదా ‘రోదసి’ అంటారు. ఇది భౌతిక విశ్వాన్ని సూచిస్తుంది.
  • అంతరిక్షం తక్కువ సాంద్రత ఉన్న పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. ఇందులో ముఖ్యంగా హైడ్రోజన్‌ ప్లాస్మా, హీలియం, ఎలక్ట్రోమాగ్నెటిక్‌ తరంగాలు, న్యూట్రినోలు, దుమ్ము, కాస్మిక్‌ కిరణాలు ఉంటాయి.
  • అంతరిక్షం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంతరిక్ష విజ్ఞానశాస్త్రం అంటారు.
  • అంతరిక్ష ప్రయాణం, అన్వేషణ, సాంకేతికత, వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ, నిర్వహణకు ఇంజినీరింగ్‌ సూత్రాలను ఉపయోగించడం లాంటి వాటిని అంతరిక్ష సాంకేతికత అంటారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఇది కొత్త మార్గాలను అందిస్తుంది. ఇందులో ఉపగ్రహాలు, అంతరిక్ష కేంద్రాలు, భూకేంద్రాలు, పర్యవేక్షణ - ట్రాకింగ్‌ కేంద్రాలు, డౌన్‌ స్ట్రీమ్‌ అనలిటిక్స్, ఏఐ, సాఫ్ట్‌వేర్‌ మొదలైనవి ఉంటాయి.
  • ఇది టెలీకమ్యూనికేషన్లు, నావిగేషన్‌ వ్యవస్థలు, వాతావరణ సూచన, వాతావరణ పర్యవేక్షణ, జాతీయ భద్రత లాంటివి నిర్వహించడం ద్వారా ఆధునిక ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తోంది.
  • 1954లో భారత ప్రభుత్వం అణుశక్తి విభాగాన్ని ఏర్పాటు చేసి, అంతరిక్ష రంగాన్ని దీని కిందకు తీసుకొచ్చింది. ఆ సమయంలో దేశంలోని శాస్త్ర-సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలన్నీ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే జరిగేవి. 1962లో భారత అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో INCOSPAR (ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌)ను ఏర్పాటు చేశారు. దీనికి విక్రమ్‌ సారాభాయ్‌ని అధ్యక్షుడిగా నియమించారు.
  • భారతదేశంలో రాకెట్‌ ప్రయోగాల కోసం 1963లో తిరువనంతపురం దగ్గర్లో తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ (టీఈఆర్‌ఎల్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. ఇది మనదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌. 1969, ఆగస్టు 15న ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)ను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

ప్రయోగ లక్ష్యాలు: 

  1. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని శోధించడం. 
  2. భూమి, సౌరవ్యవస్థ పుట్టుక గురించి తెలుసుకోవడం.
  3. జాబిల్లిపై ఉన్న ఖనిజ మూలకాలను గుర్తించి విశ్లేషించడం.
  4. భవిష్యత్తులో చేపట్టబోయే యాత్రలకు చంద్రుడిపై తగిన ప్రదేశాన్ని కనుక్కోవడం, సాంకేతికతను వృద్ధి చేయడం.
  5. చందమామపై సాఫీగా దిగేందుకు కావాల్సిన సాంకేతికతను, అనుభవాన్ని పెంపొందించుకోవడం.

ప్రత్యేకతలు 

చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫీగా దింపిన నాలుగో దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ (రష్యా), చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి ల్యాండర్, రోవర్‌ను పంపిన మొదటి దేశంగా భారత్‌ అవతరించింది. చంద్రయాన్‌-2కు అయిన ఖర్చు రూ.978 కోట్లు కాగా, చంద్రయాన్‌-3కి అయిన ఖర్చు రూ.615 కోట్లు. ఇతర దేశాల కంటే అతితక్కువ ఖర్చుతో ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ (టీఈఆర్‌ఎల్‌ఎస్‌) ఎక్కడ ఉంది?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) సోమనాథ్‌            2) తిరువనంతపురం

3) శ్రీహరికోట           4) చాందీపూర్‌

సమాధానం: 2

2. ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఎప్పుడు ఏర్పాటైంది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీఆర్‌టీ, 2018)

1) 1969       2) 1957       3)1963        4) 1974

సమాధానం: 1

3. మన దేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(ఎంపీపీఎస్సీ స్టేట్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్ష, 2025), 

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2025), 

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2024), (ఓఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2024),

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025)

1) మే 23                     2) సెప్టెంబరు 23

3) ఆగస్టు 23               4) నవంబరు 23

సమాధానం: 3

4. INCOSPAR (ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2020)

1) 1965   2) 1963   3) 1961   4) 1962

సమాధానం: 4

5. The 'Mangalyaan' mission of India was launched by, which of the following launch vehicle?
(SSC CHSL Tier-1, 2025)
1) SLV-3         2) ASLV        3) PSLV        4) GSLV
Ans: 3
6. In India, in which of the following year, the Space commission was established?
(SSC GD Constable, 2026)
1) 1961        2) 1972        3) 1984        4) 1998
Ans: 2
7. How can NISAR provide valuable information for understanding the relationship between fluid injection and earthquake?
(SSC Stenographer, 2025)
1) By tracking changes in ground surface elevation associated with pumping and injection
2) By measuring seismic activity in real time
3) By monitoring water table levels
4) By analyzing satellite imagery of earthquake damage
Ans: 1
8. In August 2025, the Indian National Space Promotion and Authorisation Centre (IN-SPACe) selected which of the following consortia to develop India’s first indigenous commercial Earth-Observation satellite constellation?
(RRB Group D, 2026)
1) PixxelSpace India Private Limited, Dhruva Space Private Limited and SatSure Analytics India Private Limited Consortium
2) Skyroot Aerospace Private Limited, Agnikul Cosmos Private Limited and Bellatrix Aerospace Private Limited Consortium
3) Hindustan Aeronautics Limited, Bharat Electronics Limited and NewSpace India Limited Consortium
4) Ananth Technologies Limited, Astrome Technologies Private Limited and Bharti Space Technologies Limited Consortium
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram