కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వాస్తవ రూపంలోకి తెచ్చి, ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని, ఉద్యోగులకు మార్గదర్శనం చేస్తూ వ్యవస్థను ముందుండి నడిపే గొప్ప శక్తే ‘ఆంట్రప్రెన్యూర్‌షిప్’ (వ్యవస్థాపకత). ఇందులో ఆంట్రప్రెన్యూర్స్ ముఖ్య భాగం. వీరు ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఆర్థిక వృద్ధిని సాధించడంలో, స్థితిస్థాపక సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సాధారణంగా వీరు చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు. సిద్ధాంతాలు, ఆదర్శాలతో సంస్థను తీర్చిదిద్దుతారు. దేశ ప్రజలకు ఉపాధి కల్పించడంలో, ఆర్థికాభివృద్ధిలో ఆంట్రప్రెన్యూర్స్ కీలకంగా వ్యవహరిస్తారు. ఆర్థిక ప్రగతి, స్వయం సమృద్ధిలో కీలకమైన అంకురాలను (స్టార్టప్స్) నెలకొల్పినవారిని గౌరవించాలనే లక్ష్యంతో ఏటా ఆగస్టు 21న ‘ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం’గా (World Entrepreneurs Day) నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆంట్రప్రెన్యూర్స్ చేస్తోన్న కృషిని అభినందించడంతోపాటు సాధికారత కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని మొదటిసారి 2010లో నిర్వహించారు. గ్రాస్‌హాపర్ కంపెనీ సహవ్యవస్థాపకులైన డేవిడ్ హౌసర్, సియామక్ తగ్డోస్ ఈ రోజును ప్రతిపాదించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, పేదరికాన్ని తగ్గించడంలో వ్యవస్థాపకుల కృషిని తెలియజేయడంతోపాటు వారిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్నారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఆంట్రప్రెన్యూర్ ముఖ్యమైన విధి?
(ఎంపీపీఎఈసీ అసిస్టెంట్ ప్రొఫెసర్, 2017)
1) ఆవిష్కరణ 2) పెట్టుబడి
3) లాభార్జన 4) పైవన్నీ
సమాధానం: 1
2. ఆంట్రప్రెన్యూర్‌షిప్ కింది దేనిపై ఆధారపడి ఉంటుంది?
(ఆర్‌పీఎస్సీ జూనియర్ అకౌంటెంట్, 2011)
1) రిస్క్ 2) ఆవిష్కరణ 3) 1, 2 4) ఏదీకాదు
సమాధానం: 3
3. ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(యూపీఎస్‌ఎస్‌ఎస్సీ పీఈటీ, 2025), (ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2021)
1) ఆగస్టు 19 2) ఆగస్టు 20
3) ఆగస్టు 21 4) ఆగస్టు 22
సమాధానం: 3
4. స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2026)
1) 2018 2) 2012 3) 2016 4) 2014
సమాధానం: 3
5. Which group primarily benefits from the Stand-Up India Scheme?
(SSC Selection Post, 2025)
1) Foreign investors 2) Large corporations
3) Government employees 4) Women and SC/ST entrepreneurs
Ans: 4
6. The Atal Innovation Mission was launched in year _______.
(SSC CGL, 2024)
1) 2021 2) 2016 3) 2014 4) 2004
Ans: 2
7. The 'Stand-Up India Scheme' is related to one of the following issues?
(UPSC CAPF, 2022)
1) Social security during old age
2) Providing technical knowhow to young, educated or skilled workers from rural areas
3) Promoting entrepreneurship amongst women, SC and ST communities
4) Insurance cover to people in the age group of 18-50 years
Ans: 3
8. Which government department grants startup recognition under the Startup India scheme?
(UPSSSC Stenographer, 2025)
1) Ministry of Skill Development Entrepreneurship (MSDE)
2) Department for Promotion of Industry and Internal Trade (DPIIT)
3) Department for Promotion of Entrepreneurship and Industry (DPEI)
4) Ministry of Micro, Small and Medium Enterprises (MoMSME)
5) None of the above
Ans: 2