జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం

జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం

మానవ ప్రమేయం లేకుండా ప్రకృతిలో నిరంతరం లభించే శక్తిని ‘రెన్యువబుల్‌ ఎనర్జీ’ అంటారు. దీన్నే తరిగిపోని శక్తిగా పేర్కొంటారు. సౌరశక్తి, పవనశక్తి, నీటిశక్తి, తరంగ శక్తి, టైడల్‌ శక్తి, భూతాప శక్తి, జీవ ఇంధనం, బయోగ్యాస్‌ మొదలైనవి దీనికి ఉదాహరణలు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, కాలుష్యరహితాలు. పునరుత్పాదక శక్తి వనరుల ఆవశ్యకతను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఆగస్టు 20న ‘జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం’గా (National Renewable Energy Day) నిర్వహిస్తారు. దీన్నే ‘అక్షయ్‌ ఉర్జా దివస్‌’ అని పిలుస్తారు. ప్రకృతిలో పరిమితంగా లభించే వనరుల వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక వనరులు వాడేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పునరుత్పాదక శక్తి అంటే?

  • ప్రకృతిసిద్ధంగా నిరంతరం లభించే, ఎప్పటికీ తరిగిపోని శక్తి రూపాలను పునరుత్పాదక శక్తి వనరులు అంటారు. అంటే వినియోగించినప్పటికీ అంతే వేగంగా వీటిని తిరిగి పొందొచ్చు.
  • ఉదా: సౌరశక్తి, పవన శక్తి, జల విద్యుత్, బయోమాస్‌ ఎనర్జీ, జియోథర్మల్‌ ఎనర్జీ, ఓషన్‌ ఎనర్జీ మొదలైనవి.
  • బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఈ వనరులు పర్యావరణ అనుకూలమైనవి, సుస్థిరమైనవి, కార్బన్‌ తటస్థమైనవి (carbon-neutral).

ప్రాముఖ్యత

  • పునరుత్పాదక శక్తి ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రతలో కీలకపాత్ర పోషిస్తుంది.
  • గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో పునరుత్పాదక శక్తి వనరులు కీలకంగా ఉంటాయి.
  • ఇంధన వనరులను వైవిధ్యపరచడం వల్ల దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. దీంతో జాతీయ ఇంధన స్వాతంత్య్రం బలపడుతుంది. తద్వారా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన సరఫరా అందుతుంది.
  • పునరుత్పాదక శక్తి రంగం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. 2024-25లో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది దాదాపు 8%వాటాను కలిగి ఉంది.
  • బయోమాస్, సౌరశక్తి ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
  • శిలాజ ఇంధనాలతో పోలిస్తే పునరుత్పాదక వనరులు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. తద్వారా ప్రజల జీవన నాణ్యత పెరుగుతుంది.
  • స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశంలో విద్యుత్‌ లోటు ఉంది. అయితే 2026, జనవరి 31 నాటికి మన దేశ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 5,20,511 మెగావాట్లు. ఇందులో శిలాజ ఇంధనాల వాటా 2,48,542 మె.వా. (47.7%) కాగా, శిలాజేతర ఇంధన వనరుల వాటా 2,71,969 మె.వా. (52.3%). మొత్తం సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం వాటా 2,63,189 మె.వా. (50.6%).
  • పునరుత్పాదక శక్తి స్వీకరణను వేగవంతం చేయడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది.  ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం ద్వారా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించే లక్ష్యంతో పీఎం సూర్య్‌ ఘర్‌ : ముఫ్త్‌ బిజిలీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.  

చారిత్రక నేపథ్యం

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయాలైన పునరుత్పాదక సహజవనరుల వాడకం వైపు ప్రజలను మళ్లించాలని నాటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ అండ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఏటా ఆగస్టు 20న ‘జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవం’గా జరుపుకోవాలని 2004లో తీర్మానించింది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. స్థాపిత సామర్థ్యం పరంగా 2030 నాటికి భారతదేశ పునరుత్పాదక శక్తి లక్ష్యం ఎంత?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2025)

1) 175 గిగావాట్లు     2) 300 గిగావాట్లు

3) 500 గిగావాట్లు     4) 100 గిగావాట్లు

సమాధానం: 3

2. కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది?

(జేకేఎస్‌ఎస్‌బీ సబ్‌ఇన్‌స్పెక్టర్, 2017)

1) సహజ వాయువు             2) పవనశక్తి

3) పెట్రోలియం                 4) అణుశక్తి

సమాధానం: 2

 3. జాతీయ పునరుత్పాదక శక్తి దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(యూజీసీ నెట్‌ పేపర్‌ 2: హోమ్‌ సైన్స్, 2025),

(కేరళ పీఎస్సీ సివిల్‌ ఎక్సైజ్, 2018), (యూపీఎస్‌ఎస్సీ పీఈటీ, 2023)

1) మార్చి 15            2) ఏప్రిల్‌ 22

3) జూన్‌ 5             4) ఆగస్టు 20

సమాధానం: 4

4. ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌ఈడీఏ)ని ఎప్పుడు స్థాపించారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023)

1) 1985           2) 1986       3) 1987       4) 1988

సమాధానం: 3
5. The share of renewable energy in the energy mix of our country sought to be achieved by 2030 is now
(UGC NET, 2022)
1) 35%        2) 40%        3) 45%        4) 50%
Ans: 4
6. According to the Ministry of New and Renewable Energy, more than 95% of the commercially exploitable wind resources out of the total estimated potential is concentrated in how many states of India?
(RRB Group D, 2022)
1) Three        2) Two        3) Four        4) Seven
Ans: 4
7. Consider the following statements regarding the National Electricity Plan 2023:
i. It projects over 50% installed power capacity from non-fossil sources by 2030.
ii. It proposes nationwide shutdown of thermal plants older than 25 years.
Which of the following is/are Correct?
(SSC CPO, 2025)
1) Only i        2) Only ii        3) i and ii        4) Neither i nor ii
Ans: 1
8. Which of the following energy sources remained the dominant contributor to India’s renewable energy growth, accounting for 47% of the total installed renewable energy capacity in 2024?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Bio-Power        2) Solar Power        
3) Wind Power        4) Small Hydro Power
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram