అంతర్జాతీయ నృత్య దినోత్సవం

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

నృత్యం అనేది కళను వ్యక్తపరిచే రూపం. సంగీతంతో కూడిన కదలికలతో హావభావాలను పలికించడం దీని ప్రత్యేకత. ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుత మానవ జీవనశైలిని మెరుగుపరచడానికి డ్యాన్స్‌ సహాయం చేస్తుంది. రాజకీయ, సాంస్కృతిక, జాతిపరమైన అడ్డంకులకు అతీతంగా నృత్యాన్ని ఒక సార్వత్రిక కళారూపంగా గౌరవించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‌ 29న ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం’గా (International Dance Day) నిర్వహిస్తారు. నృత్య కళాకారులను గౌరవించడంతోపాటు ఈ కళలోని అన్ని రూపాల విలువ, ప్రాముఖ్యత గురించి ప్రజలకు చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

నృత్యం వల్ల లాభాలు..

  • నాట్య కదలికలు మనకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. శారీరక, మానసిక, జ్ఞాన సంబంధ, ప్రవర్తనాపరమైన రుగ్మతలకు దీంతో చికిత్స చేయొచ్చు.
  • నృత్యం చేసినప్పుడు శరీరంలో మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫిన్లు లేదా హార్మోన్లు అధిక పరిమాణంలో విడుదలవుతాయి. ఆందోళన, విచారం, మానసిక ఒత్తిడి మొదలైనవాటన్నిటి నుంచి దీని ద్వారా ఉపశమనం పొందొచ్చు.
  • 30 నిమిషాల డ్యాన్స్‌తో 130 నుంచి 250 కేలరీలు ఖర్చవుతాయి. ఇది అరగంట జాగింగ్‌తో సమానమని నిపుణుల అభిప్రాయం. 

భారతదేశంలో నాట్యం..

  • భారతదేశం నాట్యకళకు ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వకాలం నుంచీ ఎంతోమంది రుషులు, పండితులు నాట్యశాస్త్రాన్ని అభివృద్ధి చేయగా; అనేకమంది రాజులు దీనికి ప్రోత్సాహం అందించారు. భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు 2025, ఏప్రిల్‌లో యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఇది మన నాట్య కళకు దక్కిన గొప్ప గౌరవం. మన దేశంలో శాస్త్రీయ, జానపద రూపాలతో సహా వైవిధ్యమైన నృత్య సంప్రదాయాలు ఉన్నాయి.
  • సంగీత నాటక అకాడమీ ప్రకారం, మన దేశంలో ఎనిమిది రకాల నృత్య రూపాలు ఉన్నాయి. అయితే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆ ఎనిమిదితోపాటు ఛౌ (Chhau) కు శాస్త్రీయ నృత్య హోదా కల్పించింది. 
  • నృత్య రూపాలన్నీ క్లిష్టమైన పదవిన్యాసాలు, హస్త ముద్రలు, భావోద్వేగభరిత ముఖ కవళికల ద్వారా వేటికవే ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. రూపంలో, భావవ్యక్తీకరణలో భిన్నంగా ఉన్నప్పటికీ అన్ని శాస్త్రీయ నృత్యాలు ప్రాచీన సౌందర్య సూత్రాలు (ancient aesthetic principles), క్రోడీకరించిన పద్ధతులు (codified techniques), భక్తి ఇతివృత్తాలతో (devotional themes) ఒక ఉమ్మడి పునాదిని కలిగి ఉంటాయి. 
భారతదేశంలోని నృత్య రూపాలు, వాటి ప్రత్యేకతలతోపాటు స్టాఫ్‌ సెలక్షన్, ఆర్‌ఆర్‌బీ, యూపీఎస్సీ తదితర పోటీ పరీక్షల్లో భారతీయ నృత్యరీతులపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌తో పాటు జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించి కీలక అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’లో అందుబాటులో ఉన్నాయి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021), (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2019)1) ఏప్రిల్‌ 29  2) ఏప్రిల్‌ 28  3) ఏప్రిల్‌ 27  4) ఏప్రిల్‌ 30

సమాధానం: 1

2. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో ఎన్ని రకాల శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) 9   2) 7   3) 11   4) 8

సమాధానం: 1

3. Natya Shastra by Bharat Muni clubbed musical instruments into how many groups?
(SSC CHSL 2025)
1) 2            2) 3            3) 4            4) 5
Ans: 3
4. In which of the following states is the famous International Sand Art Festival organised, where artists get enthralled by the diverse thoughts and their elucidation on sand?
(SSC MTS 2024)
1) Odisha        2) West Bengal        3) Assam        4) Bihar
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram