ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

ఆరోగ్యం అంటే కేవలం వ్యాధి లేకపోవడమే కాదు. ఇది సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సును సూచిస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యం. అందుకే ప్రపంచ దేశాలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి. ప్రజారోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఏటా ఏప్రిల్‌ 7న ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’గా (World Health Day) నిర్వహిస్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రపంచస్థాయి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంపై ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలకు తెలియజేయడం; మంచి ఆహార అలవాట్లు - పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వ్యవస్థాపక దినోత్సవం కూడా.

  • ఈ రోజు సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ఆరోగ్యానికి హాని కలిగించే కీలక సమస్యను తీసుకుని దానిపై ఏడాది పొడవునా ప్రచారం చేస్తుంది.  
  • ప్రచారంలో భాగంగా One Health approach పై దృష్టి సారిస్తూ.. శాస్త్రీయ విజయాలు - ఆధారాలను ఆచరణలోకి తెచ్చేలా అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)

  • 1948లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రారంభమైంది. ఇది ప్రజారోగ్యంపై అధికారిక సంస్థగా పనిచేస్తుంది.
  • వ్యాధుల నివారణ, నియంత్రణ, నిర్మూలనలో అంతర్జాతీయ ప్రయత్నాలకు ఇది నాయకత్వం వహిస్తుంది. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలను నిర్దేశిస్తూ సభ్యదేశాలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది.
  • స్మాల్‌పాక్స్‌ (మశూచి) నిర్మూలన, పోలియో కేసుల తగ్గింపు, అల్ప - మధ్య ఆదాయ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం లాంటివి డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య విజయాలు.
  • దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
  • ఇది ఏటా ప్రపంచ ఆరోగ్య నివేదిక(World Health Report - WHR)ను ప్రచురిస్తుంది.
  • ఇందులో ప్రస్తుతం భారత్‌ సహా 194 సభ్య దేశాలు ఉన్నాయి. 

లక్ష్యాలు..

  • సార్వత్రిక ఆరోగ్య కవరేజీని విస్తరించే దిశగా సాగే ప్రపంచ స్థాయి ప్రయత్నాలకు నాయకత్వం వహించడం.
  • వ్యాధుల నివారణ, నియంత్రణ, నిర్మూలన; ఆరోగ్యం, శ్రేయస్సు పెంపొందించడం లాంటి రంగాలపై దృష్టి సారించడం.
  • ప్రజారోగ్య సంబంధ అంశాలపై నాయకత్వం వహించడం, ప్రజారోగ్య ప్రమాణాలను నిర్దేశించడం, వివిధ దేశాలకు సాంకేతిక సహాయం - మద్దతు అందించడం.
  • ఇతర ఐక్యరాజ్యసమితి సంస్థలు, ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్‌ రంగంతో సహా వివిధ భాగస్వాములతో కలిసి పనిచేయడం.

చారిత్రక నేపథ్యం:

1945 ఏప్రిల్‌లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) ఏర్పాటు సమావేశంలో అంతర్జాతీయంగా ఒక ఆరోగ్య సంస్థను నెలకొల్పాలని వివిధ సభ్య దేశాలు సూచించాయి. దీని ప్రకారం, యూఎన్‌ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగాన్ని రూపొందించింది. 1946, జులై 22న 61 సభ్య దేశాలు దీనికి అనుకూలంగా ఓటు వేశాయి. తర్వాత 1948, ఏప్రిల్‌ 7న డబ్ల్యూహెచ్‌ఓ అధికారికంగా అమల్లోకి వచ్చింది. 1950 నుంచి ఏటా ఆ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కింది ఏ వయసు వారిని కౌమార దశలో ఉన్న వ్యక్తులుగా పేర్కొంది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)

1) 10 నుంచి 19 ఏళ్లు            2) 8 నుంచి 15 ఏళ్లు

3) 12 నుంచి 16 ఏళ్లు            4) 6 నుంచి 14 ఏళ్లు

సమాధానం: 1

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)లోని సభ్యదేశాల సంఖ్య?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) 181           2) 184        3) 194           4) 191

సమాధానం: 3

3. India comes under which region of World Health Organisation ?

(UPPSC Staff Nurse, 2021)

1) Africa Region            2) American Region

3) European Region            4) South East Asia Region

Ans: 4

4. The world's first Pandemic Agreement was adopted during which session of the World Health Assembly held in May 2025?

(RRB NTPC (UG), 2025)

1) 77th World Health Assembly         2) 76th World Health Assembly

3) 78th World Health Assembly        4) 79th World Health Assembly

Ans: 3

5. Who was the Director-General of the World Health Organisation in April 2020?

(SSC CHSL, 2020), (MPPKVVCL Line Attendant, 2017),
(OSSC Odisha CGL (Specialist), 2023), (RRB Clerk Mains, 2022),
(OSSSC CRE, 2022)

1) Zsuzsanna Jakab            2) Tedros Adhanom Ghebreyesus

3) Bernhard Schwartländer        4) Roberto Azevêdo

Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram