యూఎన్‌ఎఫ్‌పీఏ నివేదిక

యూఎన్‌ఎఫ్‌పీఏ నివేదిక

ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) 2026, నవంబరు 19న ప్రపంచ జనాభా స్థితి పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని తెలిపింది. ఈ దేశ జనాభాలో 26% మంది 10-24 ఏళ్ల వయసువారేనని వెల్లడించింది. భారత జనాభాను 147.66 కోట్లుగా పేర్కొంది. ఇందులో 24 శాతం మంది 0-14 ఏళ్ల వయసువారని తెలిపింది. 10-19 ఏళ్ల మధ్య వయసువారు 17 శాతం.. 15-64 ఏళ్ల వారు 69 శాతం.. 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారు 8 శాతం ఉన్నట్లు వెల్లడించింది.

  • భారతీయ మహిళల సంతానోత్పత్తి రేటు 1.9గా ఉంది. ఈ అంశంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. బిహార్‌లో ఇది 2.7గా ఉండగా.. సిక్కింలో 1.0గానే నమోదైంది.

  • దాదాపు 83 శాతం మంది.. భవిష్యత్తు పట్ల సానుకూల లేదా అత్యంత సానుకూల దృక్పథంతో ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram