కాంటార్‌ నివేదిక

కాంటార్‌ నివేదిక

దేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఎయిర్‌టెల్‌ నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టిందని కాంటార్‌ నివేదిక తెలిపింది. 2014లో కాంటార్‌ బ్రాండ్జ్‌ జాబితా ప్రారంభమయ్యాక, ఒక టెలికాం సంస్థ అగ్రస్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఎయిర్‌టెల్‌ బ్రాండ్‌ విలువ 5% పెరిగి 43.2 బి.డాలర్ల (దాదాపు రూ.4.1 లక్షల కోట్ల)కు చేరింది. 2020 నుంచి ఎయిర్‌టెల్‌ బ్రాండ్‌ విలువ 210% పెరిగింది.

  • దేశంలో అత్యంత విలువైన టాప్‌-100 బ్రాండ్‌ల మొత్తం విలువ గతేడాదితో పోలిస్తే 12% తగ్గి 460.3 బిలియన్‌ డాలర్ల (రూ.43.26 లక్షల కోట్ల)కు చేరింది. ఇది దేశ జీడీపీలో 11 శాతానికి సమానం. టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లో బ్రాండ్ల విలువ తగ్గడం ఇందుకు కారణం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram