భారతీయ వినోద, వ్యాపార, సైన్స్, క్రీడా, ప్రచార రంగాలలో దేశ భవిష్యత్తుని ప్రభావితం చేస్తున్న ప్రముఖులను గుర్తిస్తూ.. టైమ్ మ్యాగజైన్ ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా’ జాబితాను విడుదల చేసింది. భారత్‌లో ఈ తరహా ప్రత్యేక జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో 9 మంది క్రీడాకారులకు చోటు దక్కింది.
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఒలింపిక్ పతక విజేతలు లవ్లీనా బోర్గోహెయిన్, మీరాబాయి చాను, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, అథ్లెట్ విద్య రామరాజ్, ఆర్చర్ కుమ్‌కుమ్ మొహోద్, హాకీ మాజీ గోల్ కీపర్ సవితా పూనియా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ‘టైమ్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.