క్రైస్తవాన్ని అధిగమించి 2035 కల్లా ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందని ‘ఫ్యూ రిసెర్చ్ సెంటర్’ అంచనా వేసింది. ఇస్లాం, క్రైస్తవం.. రెండింటా జనాభా పెరుగుతోందని తెలిపింది. అయితే ముస్లింల సంఖ్య చాలా వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ‘ఫ్యూ రీసెర్చ్ సెంటర్’ 2026, నవంబరు 18న వెల్లడించిన వివరాలు, అంచనాల ప్రకారం..
2020-25 మధ్య ముస్లిం మహిళల్లో సంతానోత్పత్తి రేటు 3.1గా నమోదైంది. క్రైస్తవుల్లో అది 2.5గా ఉండగా.. ఇతర మతాలవారిలో కేవలం 1.6కు పరిమితమైంది.
2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ జనాభా 227 కోట్లుగా, ముస్లిం జనాభా 202 కోట్లుగా ఉంది. 2035 వరకు ముస్లింల సంఖ్య 257 కోట్లకు, క్రైస్తవుల జనాభా 252 కోట్లకు పెరగనుంది. ఇదే సరళి కొనసాగితే.. 2070 కల్లా ప్రపంచంలో 360 కోట్ల మంది ముస్లింలు, 300 కోట్లకు కాస్త తక్కువగా క్రైస్తవులు ఉంటారు.