భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి అంతర్జాతీయ కంపెనీల విలువ రెండేళ్లలో 53% పెరిగి 15 లక్షల కోట్ల డాలర్ల (రూ.1425 లక్షల కోట్ల)కు చేరుకుంది. ‘హెచ్‌ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026’ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. కృత్రిమ మేధ(ఏఐ)లో కనిపించిన వృద్ధి కారణంగా, కొన్ని కంపెనీల విలువలు భారీగా పెరిగాయని స్పష్టం చేసింది.
సుందర్ పిచాయ్ 2026 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సీఈఓగా ఉన్న ఆల్ఫాబెట్, 4.2 లక్షల కోట్ల డాలర్ల విలువతో ముందుండడం ఇందుకు నేపథ్యం. 2024తో పోలిస్తే ఆల్ఫాబెట్ విలువ 98% పెరిగింది. 2.6 లక్షల కోట్ల డాలర్ల విలువైన మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేతిలో ఉన్న సత్య నాదెళ్ల, ఈ జాబితా రెండో స్థానంలో ఉన్నారు. ఈ కంపెనీ విలువ రెండేళ్లలో 17% తగ్గింది. మైక్రాన్ టెక్నాలజీ (1.4 ట్రిలియన్ డాలర్లు) సంజయ్ మెహ్రోత్రా మూడో స్థానంలో నిలిచారు. ఈ సంస్థ విలువ 1174% దూసుకెళ్లింది.