భారత్‌లో 2015 నుంచి టీబీ కారక మరణాలు 38% తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026 వెల్లడించింది. 2015లో ప్రతి లక్ష మంది జనాభాకు 28గా ఉన్న మరణాలు ఇప్పుడు 18కి తగ్గినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటున తగ్గిన 35% మరణాలతో పోలిస్తే భారత్ మంచి పని తీరు కనబరిచింది అని పేర్కొంది