మేఘాలయలోని మావ్‌స్మై గుహలో రాళ్ల రూపంలో పేరుకుపోయిన సున్నపురాతి స్ఫటికాలను పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు 6,000 ఏళ్లనాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేయగలిగారు. ఐఐటీ ఖరగ్‌పుర్, ఐఐఎస్‌ఈఆర్ కోల్‌కతా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఈశాన్య భారతదేశంలో రుతుపవనాలు ఎలా మారాయో, వాటిపై ప్రపంచ వాతావరణం, సూర్యుడి మార్పులు ఎలాంటి ప్రభావం చూపాయో దీని ద్వారా తెలిసింది.
సుమారు 11,807 నుంచి 7,700 సంవత్సరాల క్రితం (తొలి హోలోసీన్ యుగం) భారత్‌లో వేసవి రుతుపవనాలు చాలా బలంగా ఉండేవి. ఆ సమయంలో ఈశాన్య ప్రాంతంలో భారీవర్షాలు కురిసేవి. సుమారు 7,700 నుంచి 5,622 సంవత్సరాల క్రితం (మధ్య హోలోసీన్ యుగం) రుతుపవనాలు క్రమంగా బలహీనపడి వర్షపాతం తగ్గింది.