క్యూఎస్‌ ర్యాంకింగ్‌ నివేదిక

క్యూఎస్‌ ర్యాంకింగ్‌ నివేదిక

లండన్‌ కేంద్రంగా పనిచేసే క్యూఎస్‌ ర్యాంకింగ్‌ సంస్థ 2026, నవంబరు 3న అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన 6 విద్యా సంస్థలు 2026 ఏడాదికి 100 అత్యుత్తమ ఆసియా వర్సిటీల్లో చోటు పొందాయి.

  • దేశంలో అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ దిల్లీ నిలిచింది. అయితే 2025లో ఆసియాలో 59వ ర్యాంకులో ఉన్న ఆ సంస్థ 2026లో 66కు పడిపోయింది.

  • 2025లో 64వ స్థానంలో ఉన్న ఐఐఎస్‌సీ బెంగళూరు ఈ ఏడాది 79వ స్థానానికి పడిపోయింది.

  • 2025లో 71వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే 2026లో 83వ స్థానానికి దిగజారింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram