ది లాన్సెట్‌ 2026 నివేదిక

ది లాన్సెట్‌ 2026 నివేదిక

వాతావరణ మార్పుల కారణంగా కాలాలతో పనిలేకుండా భారత్‌లో అధిక ఉష్ణోగ్రతలు విజృంభించడంతోపాటు ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటున్నాయని ‘ది లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఆన్‌ గ్లోబల్‌ హెల్త్‌ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ 2026’ ప్రపంచ నివేదిక స్పష్టం చేసింది. రాత్రి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలతో హాయిగా నిద్ర పట్టని పరిస్థితులు ఉంటున్నాయి. 2021-2025 మధ్య భారతీయులు ఏడాదికి సగటున 64 గంటల నిద్రను కోల్పోయారు. 1986-2005 కాలంతో పోల్చితే.. ఇది సంవత్సరానికి సుమారు 3 గంటలు ఎక్కువ. మొత్తంగా వడగాలుల ప్రభావం సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉంటోందని వెల్లడించింది.

  • పారిస్‌ ఒప్పందం(2016) అమల్లోకి వచ్చిన తర్వాతి దశాబ్దంలో(2016-2025) వాతావరణ ముప్పు మరింత వేగవంతమయిందని, వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో ప్రపంచ దేశాల ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవడం లేదని తాజా నివేదిక హెచ్చరించింది. గత 11 ఏళ్లు అత్యంత వేడి నమోదైన సంవత్సరాలుగా రికార్డయ్యాయని, భూమి ఉష్ణోగ్రత అంతకు ముందుతో పోలిస్తే సగటున 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram