స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్ ర్యాంకుల్లో ప్రస్తుత సంవత్సరానికి (2026) గాను ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల్లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ అగ్రగామిగా నిలిచింది. గతేడాదితో (2025) పోలిస్తే ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 2025లో అగ్రస్థానంలో ఉన్న ఖతార్ ఎయిర్‌వేస్ రెండో స్థానంలో ఉండగా, క్యాథే పసిఫిక్ మూడో ర్యాంకులో ఉంది. స్కైట్రాక్స్ ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చింది.
100కు పైగా దేశాల నుంచి సేకరించిన ప్రయాణికులకు అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ 100 విమానయాన సంస్థల్లో మన దేశం నుంచి కేవలం రెండు సంస్థలకే చోటుదక్కింది. ఎయిరిండియాకు 57వ ర్యాంకు, ఇండిగోకు 61వ ర్యాంకు లభించాయి. 2025లో ఎయిరిండియా 84వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 27 స్థానాలను మెరుగుపర్చుకుంది. మరోవైపు ఇండిగో 22 స్థానాలు కిందకు దిగివచ్చింది.