బర్గుండీ ప్రైవేట్‌ హురున్‌ ఇండియా నివేదిక

బర్గుండీ ప్రైవేట్‌ హురున్‌ ఇండియా నివేదిక
  • రూ.10,230 కోట్ల కనీస విలువ కలిగిన 500 ప్రైవేటు కంపెనీలతో యాక్సిస్‌ బ్యాంక్‌ బర్గుండీ ప్రైవేట్, హురున్‌ ఇండియా సంయుక్తంగా ‘2025 బర్గుండీ ప్రైవేట్‌ హురున్‌ ఇండియా 500 (అయిదో ఎడిషన్‌) నివేదికను విడుదల చేశాయి. ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.323 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ మొత్తం కెనడా జీడీపీ కంటే ఎక్కువ. ఇండోనేషియా, స్పెయిన్‌ దేశాల ఉమ్మడి జీడీపీతో సమానం.
  • ఈ జాబితాలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వరుసగా అయిదోసారీ అగ్రస్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈసారి కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ రంగాల నుంచి పలు కంపెనీలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్పోసిస్, విప్రో కంపెనీలు గత 5ఏళ్లలో రూ.8.5 లక్షల కోట్ల మేర తమ మార్కెట్‌ విలువను కోల్పోయాయి. గ్రో వంటి అంకురాల విలువ ఏకంగా 430% పెరిగింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram