క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనం  

క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనం  
  • మానవ తప్పిదాలతో వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పెరిగాయని క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనం వెల్లడించింది. 1970లో అత్యంత ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పది ఉంటే ఇప్పుడు 23కి చేరాయని వివరించింది. గత 50 ఏళ్లలో ఇప్పటివరకు నమోదవుతున్న అత్యధిక ఉక్కపోత రోజులకు 64 శాతం మానవ తప్పిదాలే కారణమని పేర్కొంది. సగటు ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల వేడి ఎక్కువగా ఉంటోందని తెలిపింది.  
  • 1970తో పోల్చితే ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువ ఉక్కపోత రోజులు సంభవిస్తున్నాయంది. 2025లో ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు 23 ఉంటే, వీటిలో 19 వాతావరణ మార్పులతో ఏర్పడినవని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన తేమతో కూడిన ఉక్కపోత రోజులున్న 50 నగరాల జాబితాలో మన దేశం నుంచి నాలుగు ఉన్నాయి. దేశంలోనూ ఉక్కపోత రోజులు 101 నుంచి 141కి చేరినట్లు అధ్యయనం వెల్లడించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram