ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 70 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ 2026, మే 1న 2025-26 వార్షిక నివేదికను విడుదల చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాలనా కాలంతో పోలిస్తే మోదీ పాలనలోని మొదటి పదేళ్లలో ఎఫ్‌ఐఆర్ (ఈసీఐఆర్) నమోదులు, అరెస్టులు, జప్తులు, ఛార్జిషీట్ల దాఖలు, దోషులకు శిక్షలు గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది. నివేదికలోని ముఖ్యాంశాలు..
గత యూపీఏ పాలన(2005-14)తో పోలిస్తే ప్రధాని మోదీ హయాం(2014-24)లో ఏడాదికి సగటున కేసుల నమోదు 144%, జప్తులు 494%, జప్తుచేసిన ఆస్తుల విలువ 1977%, అరెస్ట్‌లు 3,900%, ఛార్జిషీట్ల దాఖలు 1,366%, అనుబంధ ఛార్జిషీట్ల దాఖలు 1,800%, సోదాలు 7,900% పెరిగాయి.
నేర నిరూపణ జరిగి శిక్షలు పడిన వ్యక్తుల సంఖ్య, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు మొత్తం గత యూపీఏ పాలనలో జీరోకి పరిమితం కాగా, మోదీ హయాంలో అది గణనీయంగా పెరిగింది.