ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌ అధ్యయనం

ఐసీఎంఆర్‌-ఎన్‌సీడీఐఆర్‌ అధ్యయనం
  • దేశంలో మహిళలపై క్యాన్సర్‌ మహమ్మారి వ్యాప్తి విసృత్తంగా ఉంటోంది. ముఖ్యంగా రొమ్ము (బ్రెస్ట్‌) క్యాన్సర్‌ కేసుల్లో అత్యధిక శాతం వ్యాధి ముదిరాకే బయటపడుతోంది. ఇతర అవయవాలకు వ్యాప్తి (మెటాస్టాటిక్‌) చెందాక గుర్తించడం వల్ల చికిత్సకు లొంగడం కూడా కష్టమవుతోంది. దేశంలో.. మెటాస్టాటిక్‌ దశలో నిర్ధారణ అవుతున్న వారు ప్రతి 8 మందిలో ఒకరు ఉంటునానరు.
  • ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో.. ‘నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌’ డేటాను ఆధారంగా చేసుకొని.. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎన్‌సీడీ ఎపిడెమియాలజీ (ఎన్‌సీడీఐఆర్‌)-బెంగళూరు’ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఈ అధ్యయన పత్రం ఇటీవల ప్రఖ్యాత వైద్యపత్రిక ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram