నోకియా వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సూచీ

నోకియా వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సూచీ
  • భారత్‌లో సగటు నెలవారీ వినియోగదారు డేటా వినియోగం 2025లో 31 జీబీని అధిగమించింది. 2024లో ఇది 27.5 జీబీగా ఉందని నోకియా తన 13వ వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌(ఎమ్‌బీఐటీ)లో తెలిపింది. దీని ప్రకారం, 2025లో నెలవారీ 5జీ డేటా రద్దీ 70 శాతం పెరిగి 12.9 ఎక్సాబైట్స్‌(ఈబీ)కు చేరింది. దీంతో దేశంలో మొత్తం మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ రద్దీలో 5జీ వాటా 47 శాతానికి చేరువైనట్లయింది. ఒక్కో వినియోగదారు నెలవారీ మొబైల్‌ డేటా వినియోగం 2025లో 31 జీబీకి పైగా చేరింది. అయిదేళ్లలో 18 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్‌)ను ఇది ప్రతిబింబిస్తోంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram