రావులపాలెంకు ఐఎస్‌వో గుర్తింపు

రావులపాలెంకు ఐఎస్‌వో గుర్తింపు
  • డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం పంచాయతీకి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌వో) గుర్తింపు దక్కింది. రాష్ట్రంలో ఐఎస్‌వో ధ్రువపత్రం దక్కిన తొలి పంచాయతీగా రావులపాలెం రికార్డు సృష్టించింది. కేరళలోని పంచాయతీలకు ఇటువంటి ధ్రువపత్రాలు ఉంటాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటివి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి 24 పంచాయతీలను ఎంపిక చేసి, మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన ఐఎస్‌వో ఆడిట్‌ బృందం రెండు రోజులుగా రావులపాలెంను పరిశీలించింది. అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసి ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ జారీ చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram