‘ఏఈఐ 2026’ నివేదిక

‘ఏఈఐ 2026’ నివేదిక

తలసరి ఆదాయంలో 13వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌.. ప్రజలకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పనలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు యాక్సెస్‌ (ఇన్‌)ఈక్వాలిటీ ఇండెక్స్‌ (ఏఈఐ-2026) నివేదిక తెలిపింది. సామాజిక, ఆర్థిక భద్రతలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన సేవలు, అవకాశాలను ఏ మేరకు పొందుతున్నారనే అంశంపై.. ఓపీ జిందాల్‌ విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ న్యూ ఎకనమిక్‌ స్టడీస్‌ విభాగం ఏఈఐ-2026 పేరుతో నివేదిక రూపొందించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌ను ఫ్రంట్‌ రన్నర్‌గా గుర్తించింది. వివిధ సూచీల్లో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ మెరుగైన ర్యాంకు సాధించింది. మొత్తం 23 విభాగాల్లో 60 సూచీలను పరిగణనలోకి తీసుకుని స్కోరు కేటాయించారు. ధనిక రాష్ట్రాలు మెరుగైన పౌరసేవలు అందించడం సాధారణమేనని, కానీ కొన్ని పేద రాష్ట్రాలు తమ ఆదాయ స్థాయికి మించి సంపన్న రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని నివేదిక విశ్లేషించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram