డీజీఎఫ్‌టీ గణాంకాలు

డీజీఎఫ్‌టీ గణాంకాలు

ప్రపంచంలోని వివిధ దేశాలకు ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో నిలిచింది. 2025-26లో కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి సుమారు రూ.39.04 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేశాయి. అందులో ఏపీ నుంచి రూ.1.77 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఉన్నట్లు డీజీఎఫ్‌టీ పేర్కొంది. దేశంలోని మొత్తం ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 4.57%గా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం ఎగుమతుల్లో 3.18%తో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram