అమరావతికి రాజముద్ర

అమరావతికి రాజముద్ర
  • ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోం శాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు-2014 సవరణ బిల్లుపై 2026, ఏప్రిల్‌ 6న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు లభించింది. 2024 జూన్‌ 2 నుంచి అమరావతికి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది.
  • ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో ఆమోదించాయి. దీనిపై ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026గా దానికి చట్టరూపం (నం.7/2026) ఇచ్చారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram