ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 4 గ్రామ పంచాయతీలు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి, ఒక మండలం నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారానికి ఎంపికయ్యాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4.75 కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ 2026, మార్చి 31న తెలిపారు.
పంచాయతీ/మండలం సాధించిన లక్ష్యాలు.. స్థానం, బహుమానం ఇలా..
| సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు | పంచాయతీ(జిల్లా) | స్థానం | నగదు బహుమతి |
| గుడ్ గవర్నెన్స్ | శృంగవరం (అనకాపల్లి) | ప్రథమ | రూ.కోటి |
| మహిళల స్నేహపూర్వక పంచాయతీ | బొక్కసంపాలెం (తిరుపతి) | ప్రథమ | రూ.కోటి |
| పేదరిక నిర్మూలన, జీవనోపాధులు | చెముళ్లపల్లె (కడప) | ద్వితీయ | రూ.75 లక్షలు |
| స్వయం స్థిర మౌలిక సదుపాయాలు | గుండమాల (ప్రకాశం) | తృతీయ | రూ.50 లక్షలు |
| సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన | కుప్పం మండలం(చిత్తూరు) | తృతీయ | రూ.1.50 కోట్లు |