ఎగుమతి ప్రోత్సాహకాల మిషన్‌

ఎగుమతి ప్రోత్సాహకాల మిషన్‌

అంతర్జాతీయ వాణిజ్య సదస్సుల్లో ఎగుమతిదార్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి, మార్కెట్‌ అవకాశాలను మెరుగుపర్చడానికి, భౌగోళిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్న సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు మరింత మద్దతు అందించడానికి రూ.25,060 కోట్లతో తీసుకొచ్చిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ మార్గదర్శకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరించింది.

  • మార్కెట్‌ యాక్సెస్‌ సపోర్ట్‌లో భాగంగా టర్నోవర్‌ పరిమితిని పెంచారు. విక్రయదారులు-కొనుగోలుదార్ల సమావేశాలు, వాణిజ్య ప్రదర్శనలు, వాణిజ్య ప్రతినిధి బృందాల్లో పాల్గొనడానికి విమాన ఛార్జీల రీయింబర్స్‌మెంట్‌ పొందేందుకు అర్హత కలిగిన గరిష్ఠ ఎగుమతి టర్నోవర్‌ పరిమితిని రూ.75 లక్షల నుంచి రూ.50 కోట్లకు పెంచారు.

  • సూక్ష్మ, చిన్న ఎగుమతిదార్లకు విమాన ఛార్జీల రీయింబర్స్‌మెంట్‌ను 95% వరకు, ఇతర అర్హులైన ఎగుమతిదార్లకు 80% వరకు పెంచారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram