విమానాల్లో 24.61 కోట్ల మంది ప్రయాణం

విమానాల్లో 24.61 కోట్ల మంది ప్రయాణం
  • దేశంలో మొత్తం విమాన ప్రయాణికుల రద్దీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.7% పెరిగి 24.61 కోట్లకు చేరింది. 2024-25లో ఈ సంఖ్య 23.97 కోట్లుగా ఉంది. ఇందులో దేశీయ మార్గాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 1.1% పెరిగి 16.74 కోట్లుగా ఉంది.

  • అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 6.1% పెరిగి 7.87 కోట్లుగా నమోదైంది. మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యలో భారత విమానయాన సంస్థల వాటా 44.4 శాతానికి తగ్గిందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నివేదిక తెలిపింది.

  • అంతర్జాతీయ విమానయాన సంస్థల వాటా 55.6 శాతంగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణికుల గణాంకాల్లో భారత్‌కు రాకపోకలు సాగించిన ప్రయాణికులందర్నీ పరిగణనలోకి తీసుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram