137 క్యాన్సర్‌ మందుల ధరల తగ్గింపు

137 క్యాన్సర్‌ మందుల ధరల తగ్గింపు

క్యాన్సర్‌ చికిత్సలో వినియోగించే 137 రకాల ఔషధాల ధరలను 2026, నవంబరు నుంచి కంపెనీలు తగ్గిస్తున్నాయి. మందుల ట్రేడ్‌ మార్జిన్లపై పరిమితి విధించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, వివిధ బ్రాండ్లు తాము తయారు చేసే క్యాన్సర్‌ ఔషధాల గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లను 96.45% వరకు తగ్గిస్తున్నాయి.

  • ప్రస్తుత విక్రయాల పరిమాణాన్ని చూస్తే, ఏడాదిలో రూ.3,502 కోట్ల మేర వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలుగుతుందని అంచనా. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) 137 రకాల క్యాన్సర్‌ ఔషధాలపై ట్రేడ్‌ మార్జిన్లను పరిమితం చేసినట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 76 కంపెనీలు 121 రకాల మందులకు సంబంధించిన 1,225 ఫార్ములేషన్లకు సవరించిన ఎంఆర్‌పీలను సమర్పించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram