అమెరికాలో ఎస్‌బీఐ కొత్త శాఖ

అమెరికాలో ఎస్‌బీఐ కొత్త శాఖ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), అమెరికా (టెక్సాస్‌ రాష్ట్రంలో నార్త్‌ డాలస్‌ పరిధి)లోని ఫ్రిస్కో నగరంలో తన అనుబంధ సంస్థ ఎస్‌బీఐసీ బ్యాంక్‌ కొత్త శాఖను ప్రారంభించింది. కాలిఫోర్నియా వెలుపల ఈ అనుబంధ సంస్థకు ఇదే మొదటి శాఖ. ఈ కొత్త శాఖతో అమెరికాలో ఎస్‌బీఐసీ బ్యాంక్‌ మొత్తం శాఖల సంఖ్య 8కి పెరిగింది. ఈ శాఖ ద్వారా రిటెయిల్‌ డిపాజిట్లు, వాణిజ్య రుణాలు, అంతర్జాతీయ నగదు బదిలీలు (రెమిటెన్సెస్‌), ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక సేవలను అందించనున్నారు.

  • ఎస్‌బీఐ నేరుగా న్యూయార్క్, చికాగో, లాస్‌ఏంజెలిస్‌ నగరాల్లో 3 ప్రధాన శాఖలను, వాషింగ్టన్‌ డీసీలో ఒక ప్రతినిధి కార్యాలయాన్ని నడుపుతోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram