యూపీఐ లావాదేవీలు

యూపీఐ లావాదేవీలు

2026, అక్టోబరులో దేశీయంగా మొత్తం యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీల సంఖ్య 2,547 కోట్లకు చేరగా, వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే సగటున రోజూ రూ.లక్ష కోట్లకు పైగా విలువైన లావాదేవీలు యూపీఐ పద్ధతిలో జరిగాయి. ఈ లావాదేవీల రోజువారీ సగటు విలువ రూ.లక్ష కోట్లను అధిగమించడం ఇప్పుడే. రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య 82.2 కోట్లు కూడా అత్యధికమే. 2025 అక్టోబరులో నమోదైన 2,070 కోట్ల లావాదేవీల కంటే ఇవి 23% అధికం. వాటి విలువ రూ.27.27 లక్షల కోట్లు. అంటే విలువ పరంగా ఈసారి 16% పెరిగింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram