సెమీకాన్‌ 2.0

సెమీకాన్‌ 2.0

రూ.1,27,500 కోట్లతో సెమీకాన్‌ 2.0 పథకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం 2026, ఆగస్టు 31న అమల్లోకి తెచ్చింది. చిప్‌ తయారీ నుంచి స్వదేశీ డిజైన్, ఐపీ పరికరాలు, మెటీరియల్స్, అధునాతన ప్యాకేజింగ్, ఆర్‌ అండ్‌ డీ, నైపుణ్యాభివృద్ధి వంటివి ఉండే ఫుల్‌-స్టాక్‌ ఎకోసిస్టమ్‌ వరకు మన దేశ సెమీ కండక్టర్‌ ఆశయాలను మరింత పెంపొందించడం దీని లక్ష్యం.

  • కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న విప్లవం అధునాతన చిప్‌లు, మెమొరీకి భారీ గిరాకీని సృష్టిస్తోంది. ఇదే సమయంలో సరఫరా చైన్‌లోని బలహీనతలపై పెరుగుతున్న ఆందోళనలు, మారుతున్న భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ స్థాయి సంస్థలను తమ సెమీకండక్టర్‌ సామర్థ్యాలను విస్తరించుకోవడానికి, కేంద్రీకృత ఉత్పత్తి కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి పురికొల్పాయి. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రి వర్గం 2026 జులై 15న సెమీకాన్‌ 2.0 పథకానికి ఆమోదం తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram