ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ, వెనెజువెలాలోని చమురు ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా ఆర్థిక శాఖ పరిధిలోని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసీ) నుంచి కీలక లైసెన్స్ పొందింది. అమెరికా ఆంక్షల కారణంగా కొన్నేళ్లుగా పరిమితంగానే ఓఎన్‌జీసీ అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తాజా అనుమతి వల్ల, ఓఎన్‌జీసీ ఉత్పత్తిని పెంచడంతో పాటు, వెనెజువెలా ప్రభుత్వ సంస్థ పీడీవీఎస్‌ఏ నుంచి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను స్వయంగా చేపట్టేందుకు మార్గం సుగమమైందని ఓఎన్‌జీసీ డైరెక్టర్ (ఫైనాన్స్) అనుపమ్ అగర్వాల్ తెలిపారు.