సేవల రంగ ఉత్పత్తికి కొత్త సూచీ

సేవల రంగ ఉత్పత్తికి కొత్త సూచీ

దేశ సేవల రంగ ఉత్పత్తి (ఐఎస్‌పీ)ని కొలిచేందుకు సరికొత్త సూచీని ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇందుకు 2024-25ను ప్రాతిపదిక సంవత్సరంగా పరిగణిస్తారు. ప్రతి నెలా, 60 రోజులకు మందు గణాంకాలతో ఈ సూచీని విడుదల చేస్తామని గణాంక మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలి సేవా ఉత్పత్తి సూచీని, 2026  ఏప్రిల్‌ నెలకు గాను జులై 14న విడుదల చేయనున్నారు. తర్వాతి గణాంకాలను ప్రతి నెలా 29వ రోజున (ఆ రోజు సెలవైతే, తదుపరి పనిదినం)విడుదల చేస్తామని గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ(మోస్పి) పేర్కొంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram